హాంకాంగ్‌లో ప్రముఖ ప్రజాస్వామ్య అనుకూల నాయకుల్లో తొమ్మిది మందికి జైలు శిక్ష పడింది. 2019లో చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించినందుకు గాను వీరు జైలుకు వెళ్లనున్నారు. హాంకాంగ్‌లో జరిగిన ఏదైనా నేరంలో అనుమానితులను చైనాలో కూడా విచారించేందుకు డ్రాగన్ 2019లో బిల్లు తీసుకురాగా.. స్వయంప్రతిపత్తి కలిగిన హాంకాంగ్‌లో ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు పెద్దఎత్తున జరిగాయి.
దాదాపు 17లక్షలమంది పౌరులు బిల్లుకు వ్యతిరేకంగా రోడ్లెక్కారు. ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన చైనా.. ఆందోళనలకు నాయకత్వం వహించిన నాయకులపై దేశద్రోహం కింద కేసులు పెట్టి విచారణ చేపట్టింది. తాజాగా అప్పటి ప్రజాస్వామ్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న 9 మంది నేతలకు జైలు శిక్ష విధించింది.
ఇదీ చూడండి: ప్రజాస్వామ్యంపై చైనా దెబ్బ- హాంకాంగ్‌పై మరింత పట్టు