ETV Bharat / international

భారత విమానాలపై హాంకాంగ్​ నిషేధం - Boris Johnson

Hong Kong bans flights: భారత్​తో పాటు మరో ఏడు దేశాల విమానాల రాకను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది హాంకాంగ్​ ప్రభుత్వం. ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జర్మనీ ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. బ్రిటన్​లో ప్లాన్​-బీ అమలుకు యోచిస్తున్నారు ప్రధాని బోరిస్​ జాన్సన్​.

Hong Kong bans flights
Hong Kong bans flights
author img

By

Published : Jan 5, 2022, 5:08 PM IST

Updated : Jan 5, 2022, 5:32 PM IST

Hong Kong bans flights: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్​-19 ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది హాంకాంగ్​. భారత్​ నుంచి విమానాల రాకను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో మరో ఏడు దేశాలు ఉన్నాయి. జనవరి 21 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ దేశం స్పష్టం చేసింది.

''ఒమిక్రాన్​ కేసుల పెరుగుదల మాకు ఆందోళన కలిగిస్తోంది. దీనిని ఎలాగైనా మేం కట్టడి చేయాలి. అందుకే.. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్​, ఇండియా, పాకిస్థాన్​, ఫిలిప్పీన్స్​, యూకే, యూఎస్​ దేశాల ప్రయాణికులపై రెండు వారాల నిషేధం విధించాం. శనివారం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.''

- కేరీ లామ్​ చెంగ్​, హాంకాంగ్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​

Hong Kong Omicron: హాంకాంగ్​లో ఐదో వేవ్​ సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో.. కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.

బుధవారం రోజు హాంకాంగ్​లో 38 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12 వేల 799కి చేరింది. ఇప్పటివరకు 213 మంది మరణించారు.

భారత్​లో బుధవారం ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఒమిక్రాన్​ కేసులు 2 వేలు దాటాయి. ఈ నేపథ్యంలోనే.. హాంకాంగ్​ ఆంక్షల జాబితాలో భారత్​ను కూడా చేర్చింది.

Germany Restrictions:

ఒమిక్రాన్​ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వైరస్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు విధించాలని చూస్తోంది. ఈ మేరకు జనవరి 7న అన్ని రాష్ట్రాల గవర్నర్లతో ఛాన్స్​లర్​ ఉలాఫ్​ షోట్స్​ సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.

''కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. దురదృష్టవశాత్తు ఆంక్షలు విధించడం తప్పనిసరి.''

- కార్ల్​ లాఫర్​బాచ్​, జర్మనీ ఆరోగ్య మంత్రి

ఆ దేశంలో ఒక్కరోజు వ్యవధిలో 58 వేల కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

Boris Johnson hopes to 'ride out' Omicron wave

యూకేలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నప్పటికీ.. లాక్​డౌన్​ అవసరం లేదని అంటున్నారు ప్రధాని బోరిస్​ జాన్సన్​. ప్లాన్​-బీ తో ముందుకెళ్లనున్నట్లు వెల్లడించారు.​ మాస్కులు ధరించడం సహా వర్క్​ ఫ్రం హోం అవకాశాలను పెంచడం, ఏమైనా కార్యక్రమాల్లో కొవిడ్​ వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​ను తప్పనిసరి చేయడం వంటి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

టెస్టులు విస్తృతం చేసేందుకు సుమారు లక్ష మంది ఆరోగ్య కార్యకర్తల్ని నియమించాలని చూస్తున్నట్లు జాన్సన్​ వెల్లడించారు.

''మరోసారి లాక్​డౌన్ విధించకుండా ఒమిక్రాన్​ వేవ్​ను తరిమికొట్టే అవకాశం మనకు ఉంది. స్కూళ్లు కొనసాగుతాయి. వ్యాపార కార్యకలాపాలు సాగుతాయి. వైరస్​తో కలిసి జీవించేందుకు మనం ఒక మార్గాన్ని కనుగొనవచ్చు.''

- బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధాని

ఒమిక్రాన్​ విజృంభణతో బ్రిటన్​లో ఒక్కరోజే.. 2 లక్షల 18 వేల కొత్త కరోనా కేసులు వచ్చాయి.

ఇవీ చూడండి: WHO Omicron: 'ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్​'

అమెరికాలో 95శాతం ఒమిక్రాన్​ కేసులే.. ఫ్రాన్స్​లో రికార్డు స్థాయిలో..

Last Updated : Jan 5, 2022, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.