జపాన్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, వరద ప్రవాహం ఎక్కువయ్యే అవకాశం ఉండటం వలన దాదాపు 4.30 లక్షల మంది పౌరులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుపాను తీవ్రత దృష్ట్యా విద్యాసంస్థలు, పాఠశాలలకు సెలవుల్ని ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోకు 600 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది.
గురువారం వీచిన ప్రచండ గాలులకు వందలాది చెట్లు నేలకూలాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాదాపు 800 విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: 'కశ్మీర్'పై నేడు ఐరాసలో రహస్య చర్చలు?