ETV Bharat / international

'కరోనా దెబ్బకు 8.8 ట్రిలియన్ డాలర్ల నష్టం'

కొవిడ్-19 వైరస్ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుమారు 8.8 ట్రిలియన్ డాలర్లు నష్టపోనుందని లెక్కగట్టింది ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ). అది ప్రపంచ జీడీపీలో సుమారు 9.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దక్షిణాసియా జీడీపీలో సుమారు 6 శాతం మేర క్షీణత ఉంటుందని తెలిపింది. అయితే.. వివిధ దేశాలు తీసుకుంటున్న ఉద్దీపన చర్యలతో కొంత మేర ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Global economy
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 8.8 ట్రిలయన్ డాలర్ల నష్టం
author img

By

Published : May 15, 2020, 1:36 PM IST

Updated : May 15, 2020, 2:15 PM IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేసింది ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ). సుమారు 5.8-8.8 ట్రిలయన్ డాలర్ల మేర నష్టం జరగనున్నట్లు లెక్కగట్టింది. దక్షిణాసియా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)పై ప్రభావం 142-218 బిలియన్ డాలర్ల మేర ఉండనుందని వెల్లడించింది.

కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 5.8 నుంచి 8.8 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లనుంది. అది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 6.4-9.7 శాతం మేర ఉండనుంది. దక్షిణాసియా ప్రాంత జీడీపీ 3.3-6 శాతం మేర క్షీణించనుంది. ప్రధానంగా లాక్​డౌన్​ ఆంక్షలు కొనసాగుతున్న దేశాలైన బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్ వంటి వాటిపైనే అధిక ప్రభావం ఉంటుంది.

– ఆసియా అభివృద్ధి బ్యాంకు

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో..

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మూడు నెలల పాటు ఆంక్షలు కొనసాగితే 1.7 ట్రిలియన్ డాలర్లు, ఆరు నెలలు కొనసాగితే 2.5 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది ఏడీబీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణతలో అది 30 శాతం ఉంటుందని తెలిపింది.

చైనా ఆర్థిక వ్యవస్థ సుమారు 1.1 నుంచి 1.6 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోనుందని అంచనా వేసింది ఏడీబీ.

భారీగా పెరుగుదల..

మార్చి 6న విడుదల చేసిన అంచనాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుమారు 77-347 బిలియన్ డాలర్లు నష్టపోతుందని అంచనా వేసింది ఏడీబీ. అది గ్లోబల్ జీడీపీలో 0.1-0.4 శాతం ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత అంచనాలను మారుస్తూ.. ఆసియా అభివృద్ధి అంచనా (ఏడీఓ)-2020 పేరిట ఏప్రిల్ 3న విడుదల చేసింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సుమారు 2-4.1 ట్రిలియన్ డాలర్ల వరకు క్షీణిస్తుందని ఆ నివేదికలో పేర్కొంది. తాజాగా మరోమారు తన అంచనాలను సవరించింది ఏడీబీ.

ప్రపంచ బ్యాంకు అంచనా (గ్లోబల్ జీడీపీలో 2-4 శాతం క్షీణత), ఐఎంఎఫ్ అంచనా( గ్లోబల్ జీడీపీలో 6.3 శాతం క్షీణత)తో పోలిస్తే ఏడీబీ అంచనా విలువ ఎక్కువ.

ఉద్దీపన చర్యలతో ఊరట

కరోనాతో కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు పలు దేశాలు సత్వర స్పందించి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది ఏడీబీ. వివిధ రంగాలకు ఊతమిచ్చేలా ఉద్దీపన చర్యలు చేపట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం సుమారు 30-40 శాతం తగ్గనున్నట్లు తెలిపింది. దీని ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుమారు 4.1-5.4 ట్రిలియన్ డాలర్ల నష్టం తగ్గుతుందని స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రకటించిన స్థూల ఆర్థిక స్థిరీకరణ ప్యాకేజీలు గ్లోబల్ జీడీపీని 1.7-3.4 ట్రిలియన్ డాలర్లకు పెంచుతాయని పేర్కొంది. అది ఆసియాలో 339-675 బిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలిపింది ఏడీబీ.

వేతన జీవులపై..

కరోనా మహమ్మారి ప్రభావం వేతన ఆదాయాలపై పడనుందని పేర్కొంది ఏడీబీ. అమెరికా, ఐరోపా, బ్రిటన్ వంటి దేశాలపైనే అధిక ప్రభావం ఉంటుందని వివరించింది. అంతర్జాతీయంగా ఉద్యోగుల ఆదాయం సుమారు 1.2-1.8 ట్రిలియన్ డాలర్లు క్షీణిస్తుందని వెల్లడించింది. అది ఆసియాలో సుమారు 359-550 బిలియన్ డాలర్లుగా ఉండనుందని తెలిపింది.

ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పని చేసి త్వరితగతిన కరోనా మహమ్మారిని కట్టడి చేయాలని కోరింది ఏడీబీ. దీర్ఘకాలం ఆంక్షలు కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది.

Last Updated : May 15, 2020, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.