భారీ వర్షాలకు వియత్నాం అతలాకుతలమైంది. వారం రోజులుగా కొనసాగుతున్న వరద ఉద్ధృతి కారణంగా దేశవ్యాప్తంగా 17మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. లిన్ఫా తుఫాను కారణంగా దాదాపు పది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
ఇప్పటికే అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు వరదల కారణంగా లక్ష ఇళ్లు నీటమునిగాయి పేర్కొన్నారు. మరిన్ని ప్రాంతాలు నీటమునిగే అవకాశమున్నట్టు హెచ్చరించారు.
వరదల నేపథ్యంలో దాదాపు 50,000 మందిని ప్రమాదకర ప్రాంతాల నుంచి ఇతర ప్రదేశాలకు తరలించారు అధికారులు.
ఇదీ చదవండి:ఆ మాస్కులను రోజూ ఉతకకపోతే అంతే!