ETV Bharat / international

తిమింగలం కడుపులో 'నిధి'- రాత్రికి రాత్రే కోటీశ్వరులు

చేపల వేటకు వెళ్లిన జాలర్ల తలరాత రాత్రికి రాత్రే మారిపోయింది. ఓ తిమింగలం కడుపులో దొరికిన యాంబర్​గ్రీస్​తో వారికి ఏకంగా రూ.10 కోట్లు దక్కే అవకాశం లభించింది. దీంతో ఆనందంలో మునిగితేలడం వారి వంతైంది. యెమెన్​లో జరిగిందీ ఘటన.

Fishermen find ambergris worth Rs 10 crore inside carcass of a sperm whale
తిమింగలం కడుపులో 'నిధి'- రాత్రికి రాత్రే కోటీశ్వరులైన జాలర్లు
author img

By

Published : Jun 5, 2021, 2:04 PM IST

Updated : Jun 5, 2021, 2:56 PM IST

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వచ్చి తలుపుతడుతుందో ఎవ్వరికీ తెలియదు. యెమెన్​లోని 35మంది జాలర్లకూ అదే జరిగింది. ఎప్పటిలానే చేపల వేటకు వెళ్లిన వారు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారారు. తమ జీవితంలో ఊహించని ఈ పరిణామంతో వారంతో ఆనందంలో మునిగితేలుతున్నారు.

ఏం జరిగిందంటే..

పశ్చిమ యెమెన్​కు చెందిన 35మంది జాలర్లు రోజూలానే సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. చనిపోయిన ఓ స్పెర్మ్ తిమింగలం వారి పడవకు ఎదురుపడింది. ఆ భారీ కాయాన్ని కోసి చూసిన వారికి దాని కడుపులో విలువైన పదార్థం 'యాంబర్​గ్రీస్'​ లభించింది. దీన్ని మార్కెట్​కు తీసుకెళ్లి విలువ ఎంత ఉంటుందనే తెలుసుకునే ప్రయత్నం చేశారు. రూ. 10కోట్లు వరకు ధర పలుకుతుందని వ్యాపారులు చేప్పారు. దీంతో జాలర్లంతా ఉబ్బితబ్బిబైపోయారు.

యాంబర్ గ్రీస్ పదార్థం సాధారణంగా తిమింగలం వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్లు, పర్​ఫ్యూమ్ తయారీలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఒక్క కిలో యాంబర్​గ్రీస్​కు రూ.కోట్లలో ధర ఉంటుందంటే దాని విలువేంటో అర్థం చేసుకోవచ్చు.

తమకు వచ్చే రూ.10కోట్లను అందరం సమానంగా పంచుకుంటామని జాలర్లు చెప్పారు. అందులో కొంత డబ్బును తమకు తెలిసినవారికి సాయం చేసేందుకు ఉపయోగిస్తామని మంచి మనసు చాటుకున్నారు. తనకు వాటాగా వచ్చిన డబ్బుతో ఓ మంచి ఇల్లు కొనుక్కొని పెళ్లి చేసుకుంటానని ఓ జాలరి ఆనందంగా చెప్పాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Last Updated : Jun 5, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.