కరోనావైరస్‌పై రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి టీకా తొలి బ్యాచ్ మరో రెండు వారాల్లో సిద్ధమవుతుందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాస్కో తెలిపారు. ప్రస్తుతం దీనిని గమలేయా ఇన్‌స్టిట్యూట్, ఏఎఫ్‌కే సిస్టమాస్‌కు చెందిన బిన్నో ఫార్మాలో తయారు చేస్తున్నారు. ఇక్కడ ఏడాదిలో 500 మిలియన్ డోసులు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
ఈ టీకా తీసుకునేవారిని పర్యవేక్షించడం కోసం రష్యా ప్రత్యేకంగా ఒక యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. దుష్ప్రభావాలు ఏమైనా తలెత్తాయా అనే అంశాన్ని యాప్ ద్వారా అధ్యయనం చేస్తారు. ఇది రష్యా ఆరోగ్య విభాగంతో అనుసంధానమై ఉంటుంది. వైద్య సిబ్బందితో సహా ఎవరైనా తొలుత స్వచ్ఛందంగా వచ్చి టీకాను వేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. తొలుత రష్యా అవసరాలు తీర్చడానికే ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ఇక వ్యాక్సిన్‌పై వస్తున్న ఆరోపణలు ఆధారరహితమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వ్యాక్సిన్ రేసులో ట్రంప్‌పై పుతిన్ గెలిచారా?