జపాన్ రాజధాని టోక్యోలో హైస్పీడ్ రైలులో ప్రయాణిస్తున్న ఓ దుండగుడు.. ఒక్కసారిగా ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాడు. బోగీలోని ఫ్లోర్‌పై ద్రవాన్ని చల్లాడు. పేపర్, లైటర్‌తో నిప్పంటించాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు మంటలను ఆర్పేశారు.
వెంటనే ట్రెయిన్ కండక్టర్ పోలీసులకు సమాచారం అందించారు. తరువాతి స్టేషన్లో దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కియోషీ మియాకే(69)గా గుర్తించారు. అక్టోబరు 31న టోక్యో రైలులో జరిగిన ఘటనను అనుకరించే ప్రయత్నం చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో తెలిపినట్లు పేర్కొన్నారు.
ప్రమాద సమయంలో రైలు.. కుమామోటో స్టేషన్ నుంచి దక్షిణ జపాన్‌లోని షిన్- యాట్సుషిరో స్టేషన్‌కు వెళ్తోంది.
గతవారం జపాన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. టోక్యోలో ఓ దుండగుడు రైలులో 10 మంది ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. అనంతరం రైలు బోగీకి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: రైలులో 10మందిని కత్తితో పొడిచిన దుండగుడు