బంగ్లాదేశ్లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. శీతలాఖ్య నదిలో వంద మందికిపైగా ప్రయాణికులతో వెళుతున్న చిన్నపాటి లాంచీ.. సరకు రవాణా పడవను ఢీకొట్టి మునిగిపోయింది. ఈ ఘటనలో 27 మంది మరణించారు. ఆదివారం సాయంత్రం ప్రయాణికుల లాంచీ ఎంఎల్ సబీత్ అల్ హసన్.. సరకు రవాణా పడవ ఎస్కేఎల్-3ని ఢీకొట్టి మునిగిపోయింది. ఢాకాకు 16 కిలోమీటర్ల దూరంలోని నారాయణగంజ్ జిల్లాలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రయాణికుల లాంచీ మున్షిగంజ్ వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం 5 మృతదేహాలను వెలికితీసిన సహాయక సిబ్బంది, సోమవారం 22 మృతదేహాలను గుర్తించారని వెల్లడించారు. మునిగిపోయిన లాంచీని భారీ క్రేన్ సహాయంతో బయటకు తీసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి : ఇండోనేసియా వరద బీభత్సంలో 55కు మృతులు