భూకంపాలు, సునామీలతో వార్తల్లో నిలిచే ఇండోనేషియాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అధ్యక్ష ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 193 మిలియన్ మంది ఇండోనేషియావాసులు 8 లక్షల పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో 2 లక్షల 45 వేల మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
పోటాపోటీ...
అధ్యక్షుడు జోకో విడోడోతో మాజీ జనరల్ ప్రబోవో సుబియాంటో అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ తప్పదని ముందస్తు సర్వేలు అంచనా వేశాయి.
ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రాథమిక ఫలితాలు(క్విక్ కౌంట్స్) వెలువడతాయి. అధికారిక ఫలితాలు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి: ఇంటిపై విమానం కూలి ఆరుగురు మృతి