ETV Bharat / international

ఫిలిప్పీన్స్​లో భారీ భూకంపం.. 6.5 తీవ్రత నమోదు - ఫిలిప్పీన్స్​లో భారీ భూకంపం

Earthquake In Philippines: ఫిలిప్పీన్స్​లోని ఓ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై తీవ్రత 6.5గా నమోదైంది. అయితే సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు.

Earthquake In Philippines
ఫిలిప్పీన్స్​లో భారీ భూకంపం
author img

By

Published : Jan 22, 2022, 12:09 PM IST

Earthquake In Philippines: ఫిలిప్పీన్స్​లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై తీవ్రత 6.5గా నమోదైనట్లు ది ఫిలిప్పీన్స్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం​ దావో ప్రావిన్స్​​ బౌల్ట్ ద్వీపంలోని సరంగనీ పట్టణంలో శనివారం ఉదయం భూప్రకంపనలు వచ్చినట్లు చెప్పింది.

భూకంపం 66 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు సిస్మాలజీ డిపార్ట్​మెంట్​ తెలిపింది. సునామీ హెచ్చరికలు ఏమీ లేవని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

ఫిలిప్పీన్స్.. పసిఫిక్​ సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్​కు సమీపంలో ఉండటం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: షాకిచ్చిన పాక్ పైలట్.. విమానాన్ని అత్యవసర ల్యాండ్​ చేసి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.