ETV Bharat / international

కరోనా ఎక్కడ, ఎన్ని రోజులు జీవించి ఉంటుందో తెలుసా? - మాస్క్‌ బయటి పొర మీద

కరోనా వైరస్‌ ఏ ఏ ఉపరితలంపై ఎంత సేపు జీవించగలదనే విషయంపై అధ్యయనం చేశారు హాంకాంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. మాస్క్‌లపై వారం రోజులు ఉంటుందని తెలిపిన పరిశోధకులు, బ్యాంకునోట్లపై నాలుగు రోజుల పాటు సజీవంగా ఉంటుందని వెల్లడించారు.

COVID-19 virus can last on face masks for a week, banknotes for days: Study
మాస్క్‌లపై కరోనా ఎన్ని రోజులు జీవించి ఉంటుందో తెలుసా?
author img

By

Published : Apr 6, 2020, 2:12 PM IST

Updated : Apr 6, 2020, 3:30 PM IST

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో వైరస్ ఏఏ వస్తువుల మీద ఎన్ని రోజులు జీవించి ఉండగలదో అన్న దానిపై అధ్యయనం చేశారు హాంకాంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. మాస్క్‌లపై ఒక వారం, బ్యాంకు నోట్లు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, ప్లాస్టిక్‌ ఉపరితలంపై 4 నుంచి 7 రోజులు పాటు వైరస్​ సజీవంగా ఉంటుందని వెల్లడించారు. సబ్బుతో తరచుగా చేతులను శుభ్రం చేసుకోవటం ద్వారా వైరస్‌ నియంత్రించవచ్చని పేర్కొన్నారు.

COVID-19 virus can last on face masks for a week, banknotes for days: Study
కరోనా ఎక్కడ.. ఎన్ని రోజులు జీవించి ఉంటుందో తెలుసా?

మాస్క్‌ల ఉపరితలంపై వారం రోజుల పాటు ఉంటుందన్న పరిశోధకులు.. ధరించిన మాస్క్‌లను ముట్టుకోకుండా ఉంటే మంచిదని పరిశోధకుడు పీరిస్ తెలిపారు. ఆ తర్వాత చేతులతో కళ్లను తాకటం ద్వారా వైరస్ కంటి నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అన్ని ఉపరితలాలపై వైరస్‌ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టడం గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఉక్కు(స్టీల్​) మీద 72 గంటలు వైరస్​ నిలిచిఉంటుందని గమనించిన పరిశోధకులు, రాగి మీద మాత్రం 4 గంటలు జీవిస్తుందని గుర్తించారు.కిరాణా షాపుల నుంచి విక్రయించే ఆహరం, ఇతర పదార్థాల ద్వారా వైరస్​ వ్యాప్తి చెందే అవకాశం ఉందని సూచించారు. కానీ ఇప్పటివరకు వీటి వల్ల వైరస్‌ సంక్రమించినట్లు గుర్తించలేదని తెలిపారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవటం, ముక్కు, నోరు, కళ్లను తాకకుండా ఉంటే వైరస్‌ను నియంత్రించవచ్చని ముక్త కఠంతో చెప్పారు.

Last Updated : Apr 6, 2020, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.