ETV Bharat / international

విదేశీయుల వీసాల గడువును పొడిగించిన కేంద్రం

భారత్​లో ఉన్న విదేశీయుల వీసాల గడువును ఏప్రిల్ 15వరకు పొడిగించింది కేంద్రం. భారత్​లో ఉన్న విదేశీయులకు ఆయా దేశాల దౌత్య కార్యాలయాల ద్వారా అవసరమైన దౌత్య సేవలను అందించాలని నిర్ణయించింది.

COVID-19: Centre extends visas of foreigners in India till April 15
కరోనాతో స్వదేశాలకు వెళ్లలేనివారి వీసాల పొడగింపు
author img

By

Published : Mar 20, 2020, 5:37 PM IST

Updated : Mar 20, 2020, 6:36 PM IST

భారత్​లో కరోనా కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోతున్న విదేశీయుల వీసాల గడువును ఏప్రిల్​ 15వ తేదీ వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధించిన తర్వాత వీసాల గడువు ముగిసి.. స్వదేశాలకు వెళ్లలేక ఇక్కడే ఉండిపోయిన విదేశీయులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర హోం శాఖ.

ప్రస్తుతం భారత్​లో ఉన్న విదేశీ పౌరులకు.. ఫారినర్స్ రీజనల్​​ రిజిస్ట్రేషన్​, ఫారినర్స్​ రిజిస్ట్రేషన్​ కార్యాలయాల ద్వారా అవసరమైన దౌత్య సేవలను అందించాలని నిర్ణయించింది.

"మార్చి 13తో ముగిసే విదేశీ పౌరుల సాధారణ వీసాలు, ఈ-వీసాల గడువును ఏప్రిల్​ 15 అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నాం. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకుంటే, ఈ సేవ పూర్తి ఉచింతంగా అందిచబడుతుంది. అయితే విదేశీ పౌరులు 14వ తేదీ అర్ధరాత్రిలోగా తమ దేశాలకు వెళ్లాలనుకుంటే.. ఎలాంటి ఓవర్‌ స్టే పెనాల్టీ విధించకుండా అనుమతి మంజూరు చేస్తాం."

-హోం మంత్రిత్వ శాఖ

ఇదీ చదవండి:ఉరికి ముందు తిహార్​ జైలు ఎస్పీకి నిర్భయ దోషి గిఫ్ట్!

Last Updated : Mar 20, 2020, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.