ETV Bharat / international

మయన్మార్​పై పెరుగుతున్న ఆంక్షలు

మయన్మార్​లో మిలటరీ ప్రభుత్వ ఏర్పాటుతో.. ఇతర దేశాలతో ఉండే దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అమెరికాకు చెందిన 1బిలియన్​ డాలర్లు విలువ చేసే ఆస్తులను వినియోగించకుండా ఆంక్షలు విధించారు బైడెన్​. ఇక న్యూజిలాండ్​ కూడా.. ఆ దేశంతో అన్ని రాజకీయ, ఉన్నత సంబంధాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

Countries curb diplomatic ties, weigh sanctions on Myanmar
మయన్మార్​ సైన్యంపై పెరుగుతున్న ఆంక్షలు
author img

By

Published : Feb 11, 2021, 10:13 PM IST

మయన్మార్​లో సైనిక తిరుగుబాటు.. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు దెబ్బతినేందుకు కారణమవుతోంది. దీంతో అక్కడి మిలటరీ వ్యవస్థపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. సైనిక తిరుగుబాటు కారణంగా.. అమెరికాకు చెందిన 1బిలియన్​ డాలర్ల విలువైన ఆస్తులు వినియోగించకుండా అడ్డుకట్ట ఏర్పడింది. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలను ఇప్పటికే జారీ చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​. ఇకపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు.

గతంలో సైనిక పాలన కొనసాగిన మయన్మార్​లో.. క్రమంగా ప్రజాస్వామ్య పాలనవైపు అడుగులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంపై గతంలో ఉండే అనేక ఆంక్షలను ఎత్తివేసింది అమెరికా. అయితే.. ప్రజాస్వామ్య నాయకురాలు, నోబెల్ గ్రహీత ఆంగ్​ సాన్​ సూకీ నిర్బంధంతో మరోసారి సైనిక తిరుగుబాటు ప్రారంభమైంది. ఫలితంగా.. పలు దేశాలు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ దేశంపై కఠిన చర్యలను అమలు చేస్తున్న దేశాలలో న్యూజిలాండ్​ ఒకటి. మయన్మార్​తో ఇప్పటికే అన్ని రాజకీయ, ఇతర ఉన్నత స్థాయి సంబంధాలను నిలిపివేసింది న్యూజిలాండ్​. అంతేకాకుండా.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన ఎలాంటి చర్యలనైనా అడ్డుకుంటామని ప్రకటించింది.

మయన్మార్​తో 27దేశాల కూటమి సంబంధాలను సమీక్షించేందుకు, ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడిని పెంచే మార్గాల దిశగా ఐరోపా విదేశాంగ విభాగం యోచిస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 22న బ్రస్సెల్స్​లో సమావేశం నిర్వహించనున్నట్లు ఈయూ విదేశాంగ విభాగ చీఫ్​ జోసెప్​ బోరెల్​ తెలిపారు.

ఇదీ చదవండి: మయన్మార్​లో పౌర నిరసనలు ఉద్ధృతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.