ETV Bharat / international

లక్షకు చేరువలో కరోనా కేసులు- 3 వేలకు పైగా మృతులు - కరోనా న్యూస్​

చైనాలో మొదలైన కరోనా (కొవిడ్​-19) వైరస్​ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 97 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 3,345 మంది వైరస్​ బారిన పడి మృతి చెందారు.

Coronavirus toll at 1700 GMT Thursday
లక్షకు చేరువలో కరోనా కేసులు... 3 వేలకు పైగా మృతులు
author img

By

Published : Mar 6, 2020, 5:50 AM IST

Updated : Mar 6, 2020, 8:58 AM IST

లక్షకు చేరువలో కరోనా కేసులు- 3 వేలకు పైగా మృతులు

కరోనా (కొవిడ్​-19) వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 97,510 కేసులు నమోదయ్యాయి. 3,345 మంది వైరస్​ బారిన పడి మృత్యువాత పడ్డారు. సుమారు 85 దేశాలకు ఈ మహమ్మారి విస్తరించింది.

బుధవారం సాయంత్రం నుంచి 2,699 కొత్త కేసులను గుర్తించగా.. మరో 100 మరణాలు సంభవించాయి. చైనాలో 80 వేల మందికి పైగా ఈ వైరస్​ బారిన పడ్డారు. 3,012 మంది బలయ్యారు. ఇక చైనా మినహా ఇతర దేశాల్లో ఇప్పటి వరకు 17,101 కరోనా కేసులు నమోదు కాగా.. 333 మంది మరణించారు.

దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్​, ఫ్రాన్స్​ దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

అమెరికాలో 11కు చేరిన మృతులు

అమెరికాలో ఇప్పటి వరకు 11 మంది కరోనా బారిన పడి మరణించగా.. 29 కేసులు నమోదయ్యాయి. వైరస్​ను అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పేర్కొన్నారు.

ఆయా దేశాల్లో కేసులు, మరణాల సంఖ్య ఇలా

దేశం కేసులు మృతులు
దక్షిణ కొరియా6,088 35
ఇటలీ3,858 148
ఇరాన్​3,513 (591 కొత్త కేసులు)107
ఫ్రాన్స్377 (120 కొత్త కేసులు) 6
ఐరోపా5,533 158
ఒసీనియా 58 2
ఆఫ్రికా29
లాటిన్ అమెరికా26
కరేబియన్​26
సౌత్​ ఆఫ్రికా1
స్లొవేనియా1
బోస్​నియా1
హంగేరి1

Last Updated : Mar 6, 2020, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.