ETV Bharat / international

పాక్​లో హిందూ భక్తులను అడ్డుకున్న భద్రతా సిబ్బంది - పాక్​లో హిందువులపై వేధింపులు

పాకిస్థాన్​లోని శివాలయంలో పూజలు చేయనీయకుండా అడ్డుకున్నందుకు భద్రతా సిబ్బందిపై ఫిర్యాదు చేశారు హిందూ భక్తులు. ఖైబర్​ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ఆలయంలో ఈ ఘటన జరిగింది.

Complaint against security staff of Hindu temple in Pak for stopping devotees from praying
హిందూ భక్తుల పూజలను అడ్డుకున్న భద్రతా సిబ్బంది
author img

By

Published : Mar 28, 2021, 9:30 PM IST

పాకిస్థాన్​లోని పురాతన శివాలయంలో పూజలు నిర్వహించకుండా తమను అడ్డుకున్నారని ఖైబర్​ పఖ్తుం​ఖ్వా రాష్ట్రానికి చెందిన ఇద్దరు హిందూ భక్తులు ఫిర్యాదు చేశారు. ఆలయ భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మతపరమైన ఆచారాలను అడ్డుకోవడం చట్టవిరుద్ధమని ఇద్దరు హిందూ భక్తులు షామ్ లాల్, సాజిన్ లాల్ పేర్కొన్నారు.

పాకిస్థాన్​ అధికార పార్టీ అయిన తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్​కి చెందిన చట్టసభ్యులు గుర్​దీప్ సింగ్, రవి కుమార్ సహా.. ఓ పోలీస్ అధికారిపై షామ్ లాల్, సాజిన్ లాల్ ఫిర్యాదు చేశారు. ఈ ఆలయంలో మతపరమైన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించుకునేలా చూడాలని డీఐజీకి విజ్ఞప్తి చేశారు.

పాక్​లో హిందూ జనాభా..

పాకిస్థాన్‌లోని మైనారిటీల్లో హిందువులే అధికం. అధికారిక లెక్కల ప్రకారం.. అక్కడ 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. వాస్తవానికి ఈ సంఖ్య 90లక్షల వరకు ఉండొచ్చని అంచనా. సింధ్ రాష్ట్రం​లో ఎక్కువగా స్థిరపడ్డ పాక్​లోని హిందూ జనాభా.. స్థానిక ముస్లింలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. వారి సంస్కృతి, సంప్రదాయాల్లో పాలుపంచుకుంటారు. అయితే ఉగ్రవాదులు తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని పాక్​ హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పాక్​ ఆధారిత ఉగ్రసంస్థలతో భారత్​కు ముప్పు: అమెరికా

ఆ దిగ్గజ నటుల భవంతుల్ని కొననున్న పాక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.