ETV Bharat / international

ఆ బిల్లుకు చైనా ఆమోదం.. హాంకాంగ్​ స్వేచ్ఛకు తూట్లు - China new act on Hongkong

ఏళ్లు తరబడి ఒకే దేశం రెండు విధానాల కింద ​ప్రజాసామ్యం, హక్కులు హాంకాంగ్​కు ఉండేవి. అయితే జాతీయ భద్రతా బిల్లును చైనా పార్లమెంటు ఆమోదించడం వల్ల హాంకాంగ్​ స్వేచ్ఛకు తూట్లు పొడిచినట్లు అయింది. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాన్ని అణచివేసేందుకే కమ్యూనిస్టు ప్రభుత్వం దీన్ని తెచ్చిందని అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ చట్టం వల్ల హాంకాంగ్​ గుర్తింపును ఎలా కోల్పోబోతుంది?

China's parliament approves controversial Hong Kong security bill
ఆ బిల్లుకు చైనా ఆమోదం.. హంకాంగ్​ స్వేచ్ఛకు తూట్లు
author img

By

Published : May 29, 2020, 7:26 AM IST

Updated : May 29, 2020, 8:12 AM IST

హాంకాంగ్‌ స్వేచ్ఛకు తూట్లు పొడిచేలా తీసుకొచ్చిన జాతీయ భద్రతా బిల్లును చైనా పార్లమెంటు 'నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌' గురువారం ఆమోదించింది. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాన్ని అణచివేసేందుకే కమ్యూనిస్టు ప్రభుత్వం దీన్ని తెచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి. 'ప్రపంచ వాణిజ్య కేంద్రం'గా ఉన్న గుర్తింపును ఈ చట్టంతో హాంకాంగ్‌ కోల్పోయే ప్రమాదముంది. ఇంతవరకు స్వయం ప్రతిపత్తిని అనుభవిస్తున్న హాంకాంగ్‌ ఈ చట్టం కారణంగా చైనాలో ఒక భాగంగా మారిపోతుందని, అప్పుడు తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేసుకోవాల్సి ఉంటుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.

తాజా బిల్లు వివాదాస్పదం ఎందుకు?

బిల్లులోని నిబంధనల ప్రకారం హాంకాంగ్‌పై చైనా ప్రభుత్వానికి తిరుగులేని అధికారాలు వస్తాయి. చైనా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినా, దేశం నుంచి విడిపోతామని నినదించినా, విదేశీ జోక్యాన్ని ప్రోత్సహించినా నేరాలవుతాయి. ఆందోళనకారులపై 'ఉగ్రవాద' ముద్ర వేసేందుకు వీలవుతుంది. చైనా భద్రతా దళాలు ఈ నగరంలో ప్రవేశించి చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.

అంతర్జాతీయ స్పందన ఏమిటి?

చైనా ప్రభుత్వ తాజా నిర్ణయాల నేపథ్యంలో హాంకాంగ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాపై పునరాలోచన చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పారు. హాంకాంగ్‌ ఇంక ఏమాత్రం స్వయం ప్రతిపత్తిని అనుభవించడం లేదన్నారు. ఈ పరిణామాలపై జపాన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన 27 దేశాల విదేశాంగ శాఖ మంత్రులు శుక్రవారం దీనిపై చర్చలు జరపనున్నారు.

హాంకాంగ్‌ మేలు కోసమే: చైనా ప్రధాని

హాంకాంగ్‌ మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ చెప్పారు. ఒక దేశం- రెండు విధానాలు అన్న సిద్ధాంతాన్ని ఇది మరింత పటిష్ఠపరుస్తుందన్నారు. కాగా, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌ పార్లమెంటులో ముగ్గురు ప్రజాస్వామ్య అనుకూల సభ్యులు నినాదాలు చేయడంతో.. వారిని సభ నుంచి పంపించివేశారు. టెడ్‌ హ్యూ అనే సభ్యుడు కుళ్లిన మొక్కలు, బురద ఉన్న ఓ ప్లాస్టిక్‌ సీసాను సభలోకి తీసుకొచ్చాడు. చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ కారణంగా హాంకాంగ్‌ నాగరికత ఎలా కుళ్లిపోతోందో తెలిపేందుకే ఇలా చేశానని వ్యాఖ్యానించారు. "మా ఆత్మను వారు లాగేసుకున్నారు. చట్టబద్ధ పాలన, మానవ హక్కులు, మౌలిక విలువలు అన్నింటినీ తీసేసుకున్నారు. హాంకాంగ్‌ ఇప్పుడు చైనాలో ఒక నగరం మాత్రమే. మనమెరిగిన హాంకాంగ్‌ చనిపోయింది" క్లాడియా మో అనే సభ్యురాలు వ్యాఖ్యానించారు.

నగరానికి ఏమవుతుంది?

చైనాకు బ్రిటన్‌కు మధ్య జరిగిన 'నల్లమందు యుద్ధాల' అనంతరం హాంకాంగ్‌ నగరం బ్రిటిష్‌ పాలనలోకి వెళ్లింది. అప్పట్లో హాంకాంగ్‌ను బ్రిటన్‌ 99 ఏళ్ల లీజుకు తీసుకొంది. 1997లో లీజు గడువు ముగియడంతో తిరిగి చైనాకు అప్పగించింది. ఆ సందర్భంగా 'ప్రాథమిక చట్టం' (బేసిక్‌ యాక్ట్‌) పేరుతో ఓ చిన్న తరహా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఒక దేశం- రెండు విధానాలు అన్న సిద్ధాంతం అమల్లోకి వచ్చింది. ఆ విధానం ప్రకారం చైనా కమ్యూనిస్టు పాలనలోలేని ప్రజాస్వామ్యం, హక్కులు హాంకాంగ్‌లో ఉంటాయి. ఆర్థిక రంగంలో సొంత చట్టాలను రూపొందించుకొనే స్వేచ్ఛ ఉంది. ప్రత్యేక కరెన్సీ హాంకాంగ్‌ డాలరు చలామణిలోకి వచ్చింది. చైనా చట్టాలు అమల్లోకి వస్తే వాణిజ్య నిర్ణయాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వ జోక్యం పెరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి: 'గొడవ పడితే అమెరికా-చైనాలే నష్టపోతాయి'

Last Updated : May 29, 2020, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.