పొరుగు దేశం చైనా చేపడుతున్న బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్(BRI) అనే పథకంతో పర్యావరణం దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో భారీగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అన్నారు. దీనిలో సుమారు 90 శాతం కార్బన్ ఇంటెన్సివ్, శిలాజ ఇంధనంతో పని చేస్తాయని పేర్కొన్నారు. పెద్దమొత్తంలో కార్బన్‌డయాక్సైడ్‌ను కాల్చడం ద్వారా పర్యావరణ మార్పులు మరింత తీవ్రంగా మారుతాయని అంతర్జాతీయ హక్కులు, భద్రతా సంస్థ (ఐఎఫ్ఎఫ్ఆర్ఎస్) శుక్రవారం తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలలో దాదాపు 46 శాతం బొగ్గును మండించడం ద్వారా వస్తున్నాయని తెలిపిన ఐఎఫ్ఎఫ్ఆర్ఎస్.. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌కు కారణం అయ్యే వాయువులు మాత్రం 72 శాతం విద్యుత్ రంగం నుంచి వస్తున్నట్లు తెలిపాయి. చైనా పరిధిలో ఈ ప్రాజెక్ట్(China BRI Project) సుమారు ఐదు ఖండాల్లో విస్తరించి ఉంది. చైనా నియంత్రణ, పర్యావరణ మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్న కారణంగా... భూమిపై తీవ్రమైన , ప్రతికూల ప్రభావం పడుతుందని ఐఎఫ్ఎఫ్ఏఎస్ అవేదన వ్యాక్తం చేసింది.
ఇదీ చూడండి: 6 నెలల తర్వాత 80 శాతం యాంటీబాడీలు మాయం!