చైనా కంపెనీలపై అమెరికా నిషేధం విధించడాన్ని డ్రాగన్ తీవ్రంగా తప్పుబట్టింది. వీటికి స్పందనగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తమ సంస్థలపై అసమంజసమైన రీతిలో అమెరికా అణచివేతకు పాల్పడుతోందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ధ్వజమెత్తింది. అంతర్జాతీయ ఆర్థిక, వర్తక నిబంధనలను అగ్రరాజ్యం ఉల్లంఘించిందని ఆరోపించింది. చైనా సంస్థల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
షింజియాంగ్‌లోని వీగర్ ముస్లింల విషయంలో చైనా ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో చైనా సర్కారుకు సహకరిస్తున్న పలు సంస్థలను అమెరికా బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. మైనారిటీల అణచివేతకు సంబంధించి 14 సంస్థలు, చైనా సైన్యానికి సంబంధం ఉన్న మరో ఐదు సంస్థలను ఈ జాబితాలో చేర్చింది.
అయితే, షింజియాంగ్‌లో ఏకపక్షంగా ఎవరినీ నిర్బంధించలేదని చైనా స్పష్టం చేసింది. బలవంతంగా ఎవరితోనూ పని చేయించడం లేదని తెలిపింది.
ఇవీ చదవండి:
చైనాపై సీపీసీ ఉక్కు పిడికిలి బిగించిందిలా...