ETV Bharat / international

'అమెరికా, చైనా మధ్య తెగదెంపులు సులభం కాదు' - us china trade war 2020

అమెరికా, చైనా మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను తెంచుకోవటం అంత సులభం కాదని చైనా సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. దీని వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదన్నారు. ఇందుకు మద్దతిచ్చే వారి సంఖ్య చాలా స్వల్పమని అభిప్రాయపడ్డారు.

China, US
అమెరికా, చైనా
author img

By

Published : Oct 30, 2020, 3:28 PM IST

అమెరికా, చైనా తమ మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాల తెగదెంపులపై చర్చిడం సాధ్యం కాదని చైనాకు చెందిన ఓ అధికారి అన్నారు. ఇది వాస్తవికమైనది కాదని, దీనితో ఇరు దేశాలకు లేదా ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

సీపీసీ కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్​ హన్​ వెన్​జియూ.. చైనా, అమెరికా సంబంధాలపై మాట్లాడారు. ఆయా దేశాల ఆర్థిక నిర్మాణాన్ని సంతృప్తిపరచటంపై రెండు దేశాల సంబంధాలు ఆధారపడి ఉంటాయన్నారు.

"సంబంధాల తెగదెంపులను కోరుకునే వారి సంఖ్య చాలా స్వల్పం. ఇరు దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించాలని కోరుకునే వారే అధికంగా ఉన్నారు. ఆర్థిక సంబంధాలను పూర్తి స్థాయిలో తగ్గించటం సాధ్యమయ్యే పని కాదు. దీనివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. కరోనా సమయంలోనూ అమెరికా, చైనా మధ్య వాణిజ్య పరిమాణం 16 శాతం పెరిగింది."

- హన్​ వెన్​జియూ

అయితే, రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్... ప్రధానంగా చైనాతో సంబంధాల తెంచుకోవటంపై దృష్టి సారించారు. తయారీ రంగంలోనూ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రచారం చేస్తున్నారు.

ఇదీ చూడండి: అమెరికా జీడీపీ రికార్డు- క్యూ3లో 33.1 శాతం వృద్ధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.