చైనాలో కరోనా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు. మూడేళ్ల వయసు పిల్లలకూ కొవిడ్ టీకా(China Vaccine News) వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే.. ఐదు రాష్ట్రాల్లో స్థానిక అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 3-11 ఏళ్ల వయసు చిన్నారులకు టీకా(China Vaccine News) వేయించాల్సిన అవసరం ఉందని ప్రకటించారు.
పర్యటకుల కారణంగా కరోనా కొత్త కేసులు(China New Coronavirus Cases) వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. చిన్న పిల్లలకు టీకా పంపిణీపై చైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గాన్సు ప్రావిన్సులో.. సోమవారం అన్ని పర్యటక స్థలాలను అధికారులు మూసివేశారు. ఇన్నర్ మంగోలియాలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చైనాలో కొత్తగా 35 కేసులు వెలుగు చూడగా.. అందులో నాలుగు కేసులు గాన్సు ప్రావిన్సులో నమోదయ్యాయి. మరో 19 కేసులు.. ఇన్నర్ మంగోలియాలో బయటపడ్డాయి.
మరోవైపు.. ఇప్పటికే 100.07 కోట్ల మందికి పూర్తి స్థాయి టీకాలు(China Vaccination Rate) వేసింది చైనా. ఇది ఆ దేశ జనాభాలో 76శాతంతో సమానం. చైనాలో దేశీయంగా అభివృద్ధి చేసిన సినోఫామ్, సినోవాక్ టీకాలను వినియోగిస్తున్నారు. జూన్‌లోనే 3-17 ఏళ్ల వయసు వారికీ ఈ టీకాలు(China Vaccine News) వినియోగించేందుకు ఆమోదం లభించింది. అయితే.. ఇప్పటివరకు ఆ దేశంలో 12 ఏళ్ల వయసు పైవారికి మాత్రమే టీకా అందిస్తున్నారు.
రష్యాలో కరోనా కొత్త రికార్డులు
రష్యాలో కరోనా(Russia Coronavirus Cases) విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. రోజువారీ కొత్త కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఆ దేశంలో కొత్తగా 37,930 మంది వైరస్ బారినపడినట్లు తేలింది. రష్యాలో కొవిడ్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇంతటి భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూడటం ఇదే ప్రథమం. కొత్తగా మరో 1,069 మంది వైరస్‌కు బలయ్యారు.
మహమ్మారి ఉద్ధృతికి అడ్డుకట్ట వేసే దిశగా ఉద్యోగులకు వారం రోజుల పాటు సెలవులు ఇవ్వాలని రష్యా ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. కేబినెట్ చేసిన ఈ ప్రతిపాదనకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదం తెలిపారు. అక్టోబర్ 30నుంచి వారం రోజుల పాటు ఈ సెలవులు ఉంటాయి.
రష్యాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 4.5 కోట్ల మందికి మాత్రమే పూర్తి స్థాయి టీకా అందింది.
ఇవీ చూడండి: