కరోనా వైరస్ మూలాలను కనుగొనడానికి జనవరిలో తమ దేశానికి వస్తున్న నేపథ్యంలో చైనా స్పందించింది. కరోనా మూలాలు కనిపెట్టే ప్రయత్నంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిపుణులకు సహకరిస్తామని తెలిపింది.
"కరోనా వైరస్ మూలాలను కనుగొనే ప్రయత్నం గురించి డబ్ల్యూహెచ్ఓ మాకు సమాచారం అందించింది. మహమ్మారిని అంతం చేయడానికి చేసే ప్రయత్నాల్లో డబ్ల్యూహెచ్ఓకు మా వంతు పూర్తి సహకారం ఉంటుంది."
-వాంగ్ వెన్బిన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి
కరోనా పుట్టుకపై తమ దేశంలో మాత్రమే ప్రత్యేకంగా విచారణ జరపడానికి నిరాకరిస్తున్న చైనా...నెలల తరబడి సంప్రదింపుల తర్వాత డబ్ల్యూహెచ్ఓను ఎట్టకేలకు అనుమతించింది. వచ్చే నెలలో పది మంది డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం వుహాన్కు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి : కొవిడ్-19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు!