ETV Bharat / international

చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకుంటాం: చైనా

భారత్​-చైనా సరిహద్దులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని బీజింగ్​ తెలిపింది. ఇరు దేశాల మధ్య సమస్యలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటామని పేర్కొంది. సరిహద్దులో గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ మేరకు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి స్పందించారు.

China says situation at India border 'overall stable and controllable'
సరిహద్దులో పరిస్థితి నియంత్రణలో ఉంది: చైనా
author img

By

Published : May 27, 2020, 4:28 PM IST

భారత్​-చైనా సరిహద్దులో ఇరుదేశాల బలగాల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీజింగ్​ స్పందించింది. సరిహద్దులో పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావ్ లిజాన్​ తెలిపారు. రెండు దేశాల యంత్రాంగాలు చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారని చెప్పారు. సరిహద్దు వివాదంపై చైనా పూర్తి స్పష్టతతో ఉందన్నారు.

రెండు దేశాల అధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్నే తాము అనుసరిస్తున్నామని లిజాన్ అన్నారు. భారత్​ సరిహద్దులో యుద్ధానికి సన్నద్ధమవ్వాలని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ ఆ దేశ సైన్యానికి సూచించిన మరునాడే స్పందించారు లిజాన్​. తమ ప్రాంత సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. సరిహద్దు ప్రాంతంలో శాంతినెలకొల్పాలని, ప్రస్తుతం అక్కడి పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయని చెప్పారు.

కొద్దిరోజుల కిందట తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌, సిక్కింలో భారత్‌, చైనా సైనికులు రాళ్లు, ఇనపకడ్డీలు, పిడిగుద్దులతో పరస్పరం తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన అనేక మంది జవాన్లు గాయపడ్డారు. అప్పట్నుంచి లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. గాల్వాన్‌ లోయ, దెమ్‌చోక్‌, దౌలత్‌ బేగ్‌ ఓల్డీ వంటి సున్నిత ప్రాంతాలకూ ఉద్రిక్తతలు పాకాయి. రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి.

ఇదీ చూడండి: ముదురుతున్న భారత్​-చైనా వివాదం.. మరో డోక్లాం అయ్యేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.