ETV Bharat / international

కరోనా 2.0: చైనాకు కొత్త తలనొప్పి- పెరిగిన కేసులు - karona news in telugu

చైనాలో రెండో రౌండ్ మొదలుపెట్టిన కరోనా.. లక్షణాలు లేకుండా విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే 33 కేసులు నమోదవగా.. ఇందులో 31 మందికి కొవిడ్​ లక్షణాలు కనిపించకుండానే వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

China reports 33 new coronavirus cases; spike in asymptomatic infections in Wuhan
కరోనా 2.0: చైనాకు కొత్త తలనొప్పి- పెరిగిన కేసులు
author img

By

Published : May 21, 2020, 11:17 AM IST

కరోనాకు పుట్టినిల్లుగా పరిగణిస్తున్న చైనా​లో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్టే వచ్చి గత కొన్ని రోజులగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా 33 కొత్త కేసులు బయటపడ్డాయి. వీటిలో 31 కేసులు లక్షణాలు లేకుండా బయటపడ్డవే. ఈ కేసులు వుహాన్​లోనే అధికంగా నమోదవ్వడం గమనార్హం.

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ వివరాల ప్రకారం.. ఒక్క రోజులోనే లక్షణాలు కనిపించకుండా 31 కేసులు నమోదయ్యాయి. ఇందులో 28 వుహాన్​లో గుర్తించినవే. దీంతో చైనాలో ఇప్పటివరకు లక్షణాలు లేని పాజిటివ్​ కేసుల సంఖ్య 375కు చేరింది. ఈ 375 మందిని కలిసిన 861 మందిని క్వారంటైన్​లో ఉంచారు అధికారులు.

లక్షణాలు కనిపించకుండా బయటపడే కేసులతో.. వైరస్​ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందంటున్నారు వైద్యులు. వుహాన్​లో లక్షణాలు కనిపించని కేసులను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పద్ధతిలో నగర జనాభా మొత్తానికి.. అంటే సుమారు 1.10 కోట్ల మందికి పరీక్షలు నిర్వహిస్తోంది.

బుధవారం నాటికి చైనావ్యాప్తంగా 82,967 కేసులు నమోదయ్యాయి. అందులో కేవలం 84 మంది చికిత్స పొందుతున్నారు. 4,634 మంది వైరస్​ ధాటికి మృతి చెందారు. 78వేల మందికిపైగా కరోనాను జయించి ఇళ్లకు చేరుకున్నారు.

ఇదీ చదవండి:'క్లోరోక్విన్​ ఓ రక్షణ రేఖ- శక్తిమంతమైన ఔషధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.