అంగారకుడిపై దిగిన తియాన్వెన్-1 రోవర్ జూరాంగ్ పంపిన మార్స్ ఉపరితల చిత్రాలను చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ(సీఎస్ఏ) విడుదల చేసింది. రోవర్లో ప్రత్యేకంగా అమర్చిన కెమెరా 10 మీటర్ల ఎత్తులో ఫోటోలు తీసినట్లు పేర్కొంది. ఈ చిత్రాల్లో ఎరుపు వర్ణంలో అంగారకుడి ఉపరితలం మెరిసిపోతోంది. అక్కడి రాళ్లు, దుమ్మును రోవర్ తన కెమెరాల్లో బంధించింది.
వీటితో పాటు ల్యాండర్‌తో రోవర్ దిగిన సెల్ఫీ పోట్రియేట్ ఫోటోలను కూడా సీఎస్ఏ విడుదల చేసింది. అంగారకుడిపై జీవం ఉనికిని తెలుసుకునేందుకు తియాన్వెన్-1 ల్యాండర్‌తో కూడిన రోవర్‌ను చైనా గతేడాది పంపించింది. అంగారకుడి కక్ష్యలో 3 నెలల పరిభ్రమణం అనంతరం తియెన్వెన్-1 ఈ ఏడాది మేలో అంగారకుడిపై సురక్షితంగా దిగింది.
ఇదీ చూడండి: అంగారక గ్రహంపై తొలిసారి చైనా అంతరిక్ష నౌక