ETV Bharat / international

రొయ్యల ద్వారా కరోనా.. దిగుమతులను నిలిపివేసిన చైనా! - latest international news

ఈక్వెడార్​ నుంచి ఆహార పదార్థాల దిగుమతులను నిలిపివేసింది చైనా. ఆ దేశం నుంచి వచ్చిన రొయ్యల పార్సిల్ ప్యాకేజీలో వైరస్​ ఉన్నట్లు గుర్తించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిన నేపథ్యంలో వైరస్​ మళ్లీ విజృంభించకుండా చర్యలు చేపట్టింది.

China rejects food imports after virus detected
ఆహార పదార్థాల దిగుమతి ద్వారా కరోనా వ్యాప్తి! చైనా అప్రమత్తం
author img

By

Published : Jul 11, 2020, 4:49 PM IST

కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో కేసుల సంఖ్య తగ్గిపోయింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల ద్వారా వైరస్​ మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయని అధికారులు అప్రమత్తమయ్యారు. జూన్​లో కరోనా కేసులు మళ్లీ నమోదవ్వడానికి బీజింగ్​లోని అతిపెద్ద మాంసం విక్రయ మార్కెటే కారణమని తెలిసిన తర్వాత అధికారుల్లో ఆందోళన ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార పదార్థాలను ఇటీవలే పరీక్షించారు.

ఈక్వెడార్​ నుంచి దిగుమతి చేసుకుంటున్న రొయ్యల పార్సిల్​ ప్యాకేజీలో వైరస్​ ఉన్నట్లు పరీక్షల అనంతరం నిర్ధరించారు చైనా కస్టమ్స్​ అధికారులు. ఆ దేశం నుంచి ఆహార పదార్థాల దిగమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

పార్సిళ్లలోనే.. రొయ్యల్లో కాదు!

జులై 3న ఆ దేశం​ నుంచి వచ్చిన రొయ్యల ప్యాకెట్లను పరీక్షించిన అధికారులు.. పార్సిల్​ వెలుపలి భాగంలో వైరస్​ను గుర్తించారు. అయితే పార్సిల్​ లోపల, రొయ్యలలో వైరస్​ లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మార్చి 12 తర్వాత ఈక్వెడార్​ నుంచి దిగుమతి చేసుకున్న అన్ని ఆహారపు పదార్థాల పార్సిళ్లను వెనక్కి పంపించడమో లేదా నాశనం చేయడమో జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అది బంగారు​ హోటల్​.. ఫ్లాట్​ కొనొచ్చు కానీ ఉండకూడదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.