ETV Bharat / international

చైనా అంతరిక్ష కేంద్ర ప్రయోగం విజయవంతం - చైనా అధికారిక పత్రిక గ్లోబల్-టైమ్స్

అంతరిక్ష రంగంలో మరో కీలక విజయం సాధించే దిశగా చైనా ముందడుగు వేసింది. తమ ప్రయోగాలపై ఆంక్షలు విధిస్తున్న దేశాల సాయాన్ని ధిక్కరిస్తూ సొంతంగా.. అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా తొలి విజయం సాధించింది. రోదసి పరిశోధనల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న దేశాలకు సవాల్‌ విసురుతూ.. చైనాకు చెందిన లాంగ్‌ మార్చ్‌ 5 బీ రాకెట్‌ నింగిలోకి దూసుకుపోయింది

China launches first section of its third space station
రోదసిలో కేంద్రం
author img

By

Published : Apr 29, 2021, 3:01 PM IST

ప్రపంచంలోని ఐదు అగ్రదేశాలు కలిసి దశాబ్దాల పాటు కృషి చేస్తే గానీ సాధ్యం కాని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్​ఎస్​ను.. ఒంటరిగా నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. ఆ దిశగా తొలి అడుగును విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచంలోని అన్ని స్పేస్‌ ఏజెన్సీలకు సేవలను అందించే ఉద్దేశంతో.. దేశాలన్నీ కలిసి అంతర్జాతీయ సమాఖ్యగా ఏర్పడి 1998 నవంబర్‌ 20న ఐఎస్​ఎస్​ను అందుబాటులోకి తెచ్చాయి. ఐఎస్​ఎస్​ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అమెరికా, రష్యా, జపాన్‌, ఐరోపా, కెనడా వంటి స్పేస్‌ ఏజెన్సీలే దాని కార్యకలాపాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాయి. ఈ దేశాలు చైనా చేపట్టే రోదసి ప్రయోగాలు, ఉపగ్రహాల మరమ్మతులు, మానవసహిత యాత్రలపై ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. ఈ ఆంక్షలపై ‍ధిక్కార స్వరం వినిపించిన డ్రాగన్‌.. టియాన్‌ హే పేరుతో సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని నిర్మించుకునేందుకు సిద్ధమైంది. టియాన్‌ హేను ఇంగ్లీష్‌లో హెవెన్లీ హార్మొనీ అని పిలుస్తున్నారు.

విజయవంతంగా నింగిలోకి..

టియాన్‌ హే స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం కోసం.. 11 విడతల్లో రాకెట్ల ద్వారా సామగ్రిని చైనా తరలించనుంది. కనీసం 12 మంది వ్యోమగాములు దాంట్లో.. ఉండేందుకు వీలుగా సౌకర్యాలను సిద్ధం చేస్తోంది. అంతరిక్ష కేంద్ర నిర్మాణ సామగ్రిని మోసుకుంటూ.. లాంగ్‌ మార్చ్‌ 5 బీ రాకెట్‌ విజయంవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దక్షిణ చైనాలోని హైనాన్‌ లాంచ్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన రాకెట్‌ సురక్షితంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుందని.. చైనా అధికారిక పత్రిక గ్లోబల్-టైమ్స్ ప్రకటించింది. వచ్చే ఏడాది చివరి నాటికి సకల సదుపాయాలతో ఈ అంతరిక్ష కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని డ్రాగన్‌ కృత నిశ్చయంతో ఉంది. ఈ అంతరిక్ష కేంద్రం సాయంతో.. భవిష్యత్తులో తాము చేపట్టే అంగారక, చంద్ర యాత్రలను పర్యవేక్షించాలని డ్రాగన్‌ భావిస్తోంది. టియాన్‌ హే స్పేస్‌ స్టేషన్‌.. పొడవు 16.6 మీటర్లు, వ్యాసం 4.2 మీటర్లని చైనా అంతరిక్ష కేంద్రం తెలిపింది. ఈ అంతరిక్ష కేంద్రం టీ ఆకారంలో ఉంటుందని వెల్లడించింది.

ఇదీ చదవండి: గూఢచర్యానికి వ్యతిరేకంగా చైనా కొత్త నిబంధనలు

ఇదీ చదవండి: 'భారత్​ను దెబ్బకొట్టేందుకు​ చైనా కొత్త ఎత్తులు'

జిన్‌పింగ్ అభినందన..
చైనా అంతరిక్ష కేంద్రం తొలి దశను విజయవంతంగా పూర్తిచేసిన పరిశోధకులను అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందించారు. రాకెట్‌ సురక్షితంగా కక్షలోకి ప్రవేశించడంతో అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి బలమైన పునాది పడిందన్నారు. అంతర్జాతీయ సహకారం ద్వారా అంతరిక్ష వనరులను శాంతియుతంగా అభివృద్ధి చేయడానికి.. ఈ స్పేస్‌ స్టేషన్‌ దోహదపడుతుందని జిన్‌ పింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.రాకెట్‌ ద్వారా తొలుత సహాయక సామగ్రిని, విడి భాగాలను పంపుతామని.. తర్వాత తమ సిబ్బందిని కూడా పంపుతామని చైనా అంతరిక్ష సంస్థ ప్రకటించింది.

ఇవీ చదవండి: ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వీడాలి: జిన్​పింగ్

భారత్​కు ఆక్సిజన్​ సరఫరాలో చైనా అడ్డుపుల్ల!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.