ETV Bharat / international

Afghan Taliban 'చైనా మాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి'

author img

By

Published : Sep 3, 2021, 5:43 PM IST

Updated : Sep 3, 2021, 7:51 PM IST

చైనాతో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు తాలిబన్లు(taliban china connection). చైనా తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్​(Afghan Taliban) పునర్నిర్మాణానికి చైనా సాయం కోసం చూస్తున్నట్లు చెప్పారు. రష్యాతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు.

Taliban
తాలిబన్​, చైనా

అఫ్గానిస్థాన్​ను ఆక్రమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు తాలిబన్లు. చైనా తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా(taliban china connection) పేర్కొన్నారు. అఫ్గాన్​(Afghan Taliban)​ పునర్నిర్మాణం కోసం, ఆర్థికంగా చితికిపోయి, ఆకలి కేకల్లో చిక్కుకున్న దేశాన్ని బయటపడేసేందుకు చైనా వైపు చూస్తున్నట్లు చెప్పారు.

చైనా వన్​ బెల్ట్​ ప్రాజెక్టుకు మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు తాలిబన్​ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్​.

" చైనా మాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి. మా దేశాన్ని పునర్నిర్మించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నందున మాకు గొప్ప అవకాశం. దేశంలో విలువైన కాపర్​ గనులు ఉన్నాయి. వాటిని కృతజ్ఞతగా చైనాకు అందిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు చైనా మమ్మల్ని చేరవేస్తుంది."

- జబిహుల్లా ముజాహిద్​, తాలిబన్​ ప్రతినిధి.

రష్యాతోనూ సత్సంబంధాలు..

రష్యా సైతం తమకు ముఖ్యమైన భాగస్వామిగా పేర్కొన్నారు తాలిబన్​ ప్రతినిధి జబిహుల్లా. భవిష్యత్తులో మాస్కోతో మంచి సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

తాలిబన్లకు చైనా, రష్యా మద్దతు..

అఫ్గాన్​ను ఆక్రమించిన తాలిబన్లకు చైనా, రష్యాలు మద్దతు తెలిపాయి. అఫ్గాన్​ సార్వభౌమత్వాన్ని చైనా గౌరవిస్తుందని, వారి అంతర్గత విషయంలో కలుగజేసుకోబోమని, అఫ్గాన్​ ప్రజల స్నేహాన్ని కొనసాగిస్తామని ఇటీవలే ప్రకటించారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్​ వెన్​బిన్​. రష్యా సైతం తాలిబన్లకు అనుకూలంగానే ప్రకటన చేసింది.

బీఆర్​ఐ ప్రాజెక్ట్​పై చైనా ఆశాభావం..

నౌకాశ్రయాలు, రైల్వే, రహదారులు, పారిశ్రామిక పార్కుల నెట్​వర్క్​ ద్వారా తమ దేశాన్ని.. ఆఫ్రికా, ఆసియా, యూరప్​తో అనుసంధానించడానికి వేల కోట్ల రూపాయల బెల్ట్​ అండ్​ రోడ్​ ప్రాజెక్టును(బీఆర్​ఐ)ని చేపట్టింది చైనా. అఫ్గాన్​లో తాలిబన్ల రాకతో అఫ్గాన్​కు తమ ప్రాజెక్టును పొడగించేందుకు మార్గం సుగమమైనట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. సీపెక్​ ప్రాజెక్టులో భాగంగా పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​, చైనా దేశాలను కలుపుతూ ఈ ప్రాజెక్టు చేపట్టగా.. గతంలో ఘనీ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. పాక్​లో తాలిబన్లకు ఆశ్రయం కల్పిస్తున్న నేపథ్యంలో అడ్డు చెప్పింది. తాజాగా చైనాకు అడ్డు తొలిగినట్లయింది.

ఇదీ చూడండి: Afghan news: అఫ్గాన్‌ సంపదపై డ్రాగన్‌ కన్ను.. తాలిబన్లతో మంతనాలు!

Last Updated : Sep 3, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.