అమెరికా అధ్యక్ష పోరులో బైడెన్ నెగ్గినా అధికారికంగా ఫలితం వెల్లడించే వరకు తాము ఎటువంటి అభినందన సందేశాలు పంపేది లేదని చైనా స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వెల్లడించారు. ఎన్నికల ఫలితం ఆ దేశ చట్టాల ప్రకారం నిర్ణయించుతారని, ఈ విషయంలో మేము అంతర్జాతీయ పద్ధతులను అనుసరిస్తామని తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించారు. కానీ ఆ దేశ చట్టాల ప్రకారం ఇంకా ఆయన గెలుపు ఇంకా ధ్రువీకరించలేదు. ఇతర దేశాల రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చడం చైనా విధానం కాదు. అమెరికా, చైనా మధ్య ఉన్న విభేదాలను పరస్పర గౌరవంతో పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.
-వాంగ్ వెన్బిన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి