ETV Bharat / international

అమెరికా ఎన్నికలపై ఎట్టకేలకు స్పందించిన చైనా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై స్పందించిన చైనా.. జో బైడెన్, కమలా హారిస్​లకు అభినందనలు తెలిపింది. అమెరికా ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేసింది. అగ్రరాజ్య ఎన్నికలపై తొలుత ఎలాంటి ప్రకటన చేయని చైనా.. తాజాగా స్పందించడం గమనార్హం.

China finally congratulates Biden, Harris for their victory in US presidential election
అమెరికా ఎన్నికలపై ఎట్టకేలకు స్పందించిన చైనా
author img

By

Published : Nov 13, 2020, 4:04 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై చైనా ఎట్టకేలకు స్పందించింది. విజేతగా నిలిచిన జో బైడెన్​, కమలా హారిస్​లకు అభినందనలు తెలిపింది. అమెరికా ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొంది.

"అమెరికా ఎన్నికలపై ఆ దేశంతో పాటు అంతర్జాతీయంగా వచ్చిన స్పందనలను గమనిస్తున్నాం. అమెరికా ప్రజల నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. బైడెన్, హారిస్​లకు అభినందనలు తెలుపుతున్నాం. అమెరికా చట్టాలు, విధి విధానాలు అనుసరించి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తారని మేం అర్థం చేసుకున్నాం."

-వాంగ్ వెన్​బిన్, చైనా విదేశాంగ ప్రతినిధి

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికవడాన్ని స్వాగతించారు వెంగ్​బిన్. ప్రపంచంలోని మహిళల అభివృద్ధికి చైనా కట్టుబడి ఉందన్నారు. మహిళలకు పురుషులతో సమాన హోదా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ ఐరాసలో చేసిన వ్యాఖ్యలను పాత్రికేయులు ప్రస్తావించగా ఇలా స్పందించారు.

"మహిళలు ఆకాశంలో సగభాగం అని చైనాలో ఓ సామెత ఉంది. లింగ సమానత్వాన్ని నిజం చేయడానికి, ప్రపంచంలోని మహిళల అభివృద్ధికి చైనా ఎల్లప్పుడు కట్టుబడి ఉంది."

ఓటమిని అంగీకరించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించడం వల్ల అమెరికా ఎన్నికలపై చైనా తొలుత ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఆ దేశ చట్టాలకు అనుగుణంగా అమెరికా ఎన్నికల ఫలితాలు ఉంటాయని నవంబర్ 9న వాంగ్ వెన్​బిన్ పేర్కొన్నారు. బైడెన్​కు అభినందనలు తెలిపేందుకు సైతం అప్పుడు నిరాకరించారు.

ఇదీ చదవండి- పసిడితో ప్రత్యేక 'స్వీట్లు'- ధరెంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.