ప్రపంచ మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనే దిశగా చైనా ముందడుగేసింది. తొలి దశ ప్రయత్నంలో భాగంగా.. 18- 60 ఏళ్ల మధ్యగల 108 మంది వుహాన్ వాసులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించింది. వీరిని మూడు సమూహాలుగా విభజించి వేర్వేరు డోసుల్లో ప్రయోగించారు శాస్త్రజ్ఞులు.
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఔషధ సంస్థలు, ప్రయోగశాలలన్నీ వ్యాక్సిన్ కనుగొనే దిశగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైరస్‌కు టీకాను కనుగొనే దిశగా ప్రయోగాలు ముమ్మరం చేసిన అమెరికా ఓ వ్యాక్సిన్ రూపొందించి 45 మందిపై ప్రయోగించింది.
వ్యాక్సిన్‌ను కనుగొనడానికి చైనా తీవ్రంగా శ్రమిస్తోందని 'చైనా నేషలిస్టిక్ గ్లోబల్ టైమ్స్' ప్రచురించింది. ఇందుకోసం అమెరికా 18 నెలల గడువు విధించుకోగా అంతకంటే ముందే చైనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి: ఆ దేశాల పాఠాలతో.. భారత్ మేల్కొనాల్సిన తరుణమిదే!