ETV Bharat / international

దేశం ఏదైనా... దౌర్జన్యమే డ్రాగన్​ విధానం - China angry over India

దురుసుతనం, దౌర్జన్యం, దురాక్రమణకు అడ్డాగా మారింది చైనా. ఇటీవలి చైనా పాల్పడిన దుస్సాహసాలే ఇందుకు నిదర్శనం. ఆసియా, దక్షిణ చైనా సముద్రంలో పట్టుతో పాటు ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు తహతహలాడుతోంది చైనా. వాణిజ్య యుద్ధంతో అగ్రరాజ్యమైన అమెరికాను కవ్విస్తూ.. సరిహద్దు ఘర్షణలతో భారత్​ను ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. అసలు చైనా ఎందుకిలా చేస్తోంది..? సరిహద్దు దేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం మానేసి కయ్యానికెందుకు కాలుదువ్వుతోంది..? ఆసియాలో ఖండంలో ఎన్నో దేశాలున్నా చైనాకు భారత్​పైనే ఎందుకంత కసి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు పరిశీలిస్తే..

China disputes with World countries
ప్రపంచదేశాలపై చైనా దౌర్జన్యం.. ఇవిగో సాక్ష్యాలు
author img

By

Published : Jun 17, 2020, 4:09 PM IST

Updated : Jun 17, 2020, 5:55 PM IST

49 దేశాలు.. 456 కోట్లకుపైగా జనాభా... 66.44 ట్రిలియన్​ డాలర్ల జీడీపీ... ఇవీ ప్రస్తుతం ఆసియా ఖండం గణాంకాలు.

140 కోట్లకుపైగా జనాభా... ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానం... ఆసియాలో మొదటిస్థానం... ఇవీ చైనా గణాంకాలు.

జనాభా, సైనిక శక్తి, ఆర్థికం ఇలా ఏ రంగంలో చూసుకున్నా ఆసియాలో చైనాదే అగ్రస్థానం. అయినా ఏం లాభం! పాకిస్థాన్​, ఉత్తర కొరియా మినహా ఆసియాలోని ఏ దేశంతోనూ చైనాకు సత్సంబంధాలు లేవు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు. అందుకేనేమో.. చైనాతో ఏ దేశమూ సఖ్యంగా వ్యవహరించదు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నా ప్రధానంగా చెప్పుకోవాల్సింది చైనా పాలకుల దురుసుతనం. ఇతర దేశాల్లో అంతర్భాగమైన పలు ప్రాంతాలను అక్రమంగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకునే దౌర్జన్యం, దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం దురాక్రమాలకు పాల్పడటం, దీనికి తోడు సరిహద్దులో విచక్షణా రహితంగా వ్యవహరించడం లాంటి అనేక కారణాలతో ఆసియాలోని దాదాపు అన్ని దేశాలకూ చైనా విరోధిగా మారింది.

అసలు చైనా ఎందుకిలా చేస్తోంది? సరిహద్దు దేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం మానేసి కయ్యానికెందుకు కాలుదువ్వుతోంది? ఆసియా ఖండంలో ఎన్నో దేశాలున్నా చైనాకు భారత్​పైనే ఎందుకంత కసి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు పరిశీలిస్తే..

భారత్​పైనే ఎందుకు?

చైనా ప్రస్తుత జీడీపీ 13.61 లక్షల కోట్ల అమెరికన్​ డాలర్లు. భారత్​ది 2.65లక్షల కోట్ల అమెరికన్​ డాలర్లు. గత కొన్నేళ్లుగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంవైపు దూసుకెళ్తున్న భారత్​.. ఆసియాలోని దాదాపు అన్ని దేశాలకూ మిత్రదేశమే. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. చైనాను అధిగమించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ అవతరించగల శక్తి ఆసియాలో ఒక్క భారత్​కు మాత్రమే ఉంది. అందుకే ప్రాంతీయంగా తమ పట్టును కోల్పోకూడదని, భారత్​ను నిలువరించేందుకు అన్ని విధాలా అడ్డుకోవాలని కక్ష గట్టింది చైనా. ఇందుకోసం ఎన్నో కుయుక్తులకూ పాల్పడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్​కు చోటు దక్కకుండా అడ్డుపుల్ల వేసింది. చైనా-పాకిస్థాన్​ కారిడార్​ను రూపొందించి భారత్​ను ఇరకాటంలో పెట్టాలని చూసింది. అయినప్పటికీ భారత్​.. చైనాకు తలొగ్గకపోయే సరికి ఇక సరిహద్దు రగడకు తెరతీసింది. 2017లో డోక్లాం వివాదంతో మొదలుపెట్టి తాజా గాల్వన్​ లోయ ఘర్షణ వరకూ తెచ్చింది. ఇందుకోసం నేపాల్​నూ అస్త్రంగా ఉపయోగించుకుంటోంది.

China disputes with World countries
అరుణాచల్​ ప్రదేశ్​

భారత్​-చైనా సరిహద్దు వివాదాలివే..

చైనా-భారత్​ మధ్య ఎన్నో అంశాల్లో ఏకాభిప్రాయం కుదరనప్పటికీ.. ముఖ్యంగా అరుణాచల్​ ప్రదేశ్ గురించే వివాదం నడుస్తోంది​. ప్రస్తుతం భారత్​లో అంతర్భాగమైన 83,743 చదరపు​ కిలోమీటర్ల భూభాగమున్న అరుణాచల్​ ప్రదేశ్​ మొత్తం తమదేనని చైనా వాదిస్తోంది. అంతేకాదు ఆ రాష్ట్రాన్ని దక్షిణ టిబెట్​గానూ పరిగణిస్తోంది. ఒకవేళ పూర్తి రాష్ట్రాన్ని తమకు ఇచ్చేందుకు భారత్​ సుముఖంగా లేకపోతే కనీసం తవాంగ్​ ప్రాంతాన్నైనా తమకు తిరిగిచ్చేయాలని బీజింగ్​ పాలకులు డిమాండ్​ చేస్తున్నారు.

జమ్ముకశ్మీర్​లో అంతర్భాగమైన అక్సాయిచిన్​లో 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కూడా ఆక్రమించింది చైనా. దీనికి తోడు 1963 సినో-పాక్​ ఒప్పందం ప్రకారం.. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో 5,180 కిలోమీటర్ల భూమి ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉంది.

రష్యా

సైనికపరంగా అత్యంత శక్తిమంతమైన దేశంగా పేరున్న రష్యాతోనూ కయ్యానికి సై అంది చైనా. మంగోలియాలోని జెన్​బావో దీవుల కోసం సోవియెట్​ రష్యాతో యుద్ధం కూడా చేసింది. రెండు వారాలపాటు జరిగిన ఈ ఘర్షణలో పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఎట్టకేలకు తమ పంతం నెగ్గించుకుని జెన్​బావో దీవులను సాధించుకుంది చైనా.

ఆ తర్వాత 1991లో సినో-సోవియెట్​ ఒప్పందంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎలాంటి అణ్వాయుధ దాడికి పాల్పడకూడదని ఇరుదేశాలు అంగీకరించాయి.

నేపాల్​

నేపాల్​లోని పలు ప్రాంతాలు తమకే చెందుతాయన్నది చైనా వాదన. ఇరుదేశాల మధ్య 1956, 1960లో కుదిరిన ఒప్పందాల ప్రకారం వివాదంలోని కాలాపానీ లాంటి ప్రాంతాలు టిబెట్​కు చెందినవని.. అందుకే అవి తమ అధీనంలోకి వస్తాయని చైనా వాదిస్తోంది.

టిబెట్​ను చైనా భూభాగంగా గుర్తిస్తూ 1960లో నేపాల్​-చైనా 'సినో-నేపాల్​ ట్రీటీ పీస్​ ఆఫ్​ ఫ్రెండ్​షిప్' అనే ఒప్పందం చేసుకున్నాయి. చైనా ఇప్పుడు అదే ఒప్పందాన్ని అడ్డు పెట్టుకుని నేపాల్​లోని పలు ప్రాంతాలు తమవేనని వాదిస్తోంది. ఇందుకోసం తాజాగా నేపాల్ దేశ చిత్రపటాన్ని కూడా మార్చేలా ప్రోత్సహించింది.

వియత్నాం

వియత్నాంతో చైనా 1,281 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. దక్షిణ చైనా సముద్రంలోని పలు ప్రాంతాలపై పట్టు కోసం ఇరుదేశాల మధ్య వివాదాలు తలెత్తాయి. అంతేకాదు 1979 నుంచి 1990 వరకు వియత్నాం-చైనాలు సుదీర్ఘ సరిహద్దు యుద్ధం కూడా చేశాయి.

జపాన్, తైవాన్​తో..

తూర్పు చైనా సముద్రంలోని పలు ప్రాంతాలు తమకు చెందినవేనని వాదిస్తోంది చైనా. ముఖ్యంగా సెంకకు (లేదా) దియోయూ ద్వీపాల కారణంగా జపాన్​-చైనా మధ్య వివాదాలు తలెత్తాయి. రియుక్యూ దీవుల్లో భాగమైన ఈ ప్రాంతం 1895 నుంచి జపాన్​ అధీనంలోనే ఉంది. అయితే సెంకకు ద్వీపాల్లో ఇంధన నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో ఆ ద్వీపాలు తమకు చెందినవని 1970 నుంచి వాదన మొదలుపెట్టింది చైనా.

China disputes with World countries
చైనా-జపాన్​ వివాదం

తైవాన్​ కూడా ఈ ద్వీపాలు తమవేనని చెబుతోంది. చైనా మాత్రం ఏకంగా తైవాన్​ మొత్తం తమ దేశంలో భాగమేనని వాదిస్తోంది. దీంతో తైవాన్​తోనూ ఎడముఖం పెడముఖంగా మారింది చైనా పరిస్థితి.

China disputes with World countries
చైనా-జపాన్​ వివాదం

ఉత్తర కొరియాతో మైత్రి

చైనా-ఉత్తర కొరియా మధ్య చాలా ఏళ్లు మంచి బంధమే కొనసాగింది. అయితే కిమ్​ జోంగ్​ ఉన్​ సర్కారు అణ్వాయుధ ప్రయోగాలకు పాల్పడటం, చైనా ఫిషింగ్​ బోట్లను ఉత్తర కొరియా తమ ఆధీనంలోకి తీసుకోవడం వల్ల గత కొద్ది సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు సన్నగిల్లాయి. 2018 వరకు ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు అంతంత మాత్రమే. అయితే 2019లో కిమ్​ జోంగ్​ ఉన్​.. పలుమార్లు చైనాలో పర్యటించినందున పాత మిత్రుల మధ్య స్నేహం మరోసారి బలపడింది. అయినప్పటికీ ఉత్తర కొరియా అధీనంలోని పలు ప్రాంతాలు తమవేనని వాదిస్తోంది చైనా.

అమెరికాతోనూ కయ్యం

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాను అధిగమించి ప్రపంచదేశాలపై తమ ఆధిపత్యం చెలాయించేందుకు యూఎస్​తో కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. ఇదే అంశంపై గత కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. 2018-19లో వీరి మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. చైనా దిగుమతులపై అమెరికా.., యూఎస్​ దిగుమతులపై చైనా పోటాపోటీగా సుంకాల్ని పెంచుకున్నాయి.

కరోనా వైరస్​పైనా..

ఇటీవల ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్​లో పుట్టిందని ప్రపంచ దేశాలన్నీ కోడై కూస్తున్నాయి. అయినప్పటికీ ఈ అంశంపై ఎదురుదాడికి దిగింది చైనా. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు వక్రదారులు వెతికింది. అమెరికానే ఈ వైరస్​ను పుట్టించిందని ఏకంగా యూఎస్​పైనే ఆరోపణలు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చైనా చెప్పినట్లే నడుచుకుంటోందని అమెరికా సైతం తీవ్ర ఆరోపణలు చేసింది. అందుకు తగ్గ ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని వెల్లడించింది. అనంతరం డబ్ల్యూహెచ్​ఓకు ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది ట్రంప్​ సర్కారు.

ఇంకా ఎన్నో దేశాలు

ఇవేకాదు.. ఫిలిప్పీన్స్​, దక్షిణ కొరియా, భూటాన్​, కజకిస్థాన్​, లావోస్​, తజికిస్థాన్​, కాంబోడియా, కిర్గిస్థాన్​, మలేసియా, మంగోలియా, అఫ్గనిస్థాన్​ దేశాల్లో దురాక్రమణల కారణంగా ఆయా దేశాలతో చైనా సత్సంబంధాలు దెబ్బతిన్నాయి.

Last Updated : Jun 17, 2020, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.