భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీపంలో, టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్ నిర్మించేందుకు చైనా వేసిన ప్రణాళికలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా.. ఈ ప్రాంతానికి సమీపంలో ఓ వ్యూహాత్మక రహదారి నిర్మాణ పనులను చైనా పూర్తి చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతంలో ఉన్న రహదారిగా అభివర్ణించింది.
6,009 మీటర్ల గరిష్ట లోతుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతమైన యార్లుంగ్ జాంగ్బో గ్రాండ్ లోయ వెంబడి.. 310 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన రహదారి గత శనివారం పూర్తయినట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. న్యిన్గ్చి, మెడాగ్ను జోడిస్తూ జరిగిన 67.22 కిలోమీటర్ల నిర్మాణంతో రహదారి పనులు ముగిసినట్టు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంగా, టిబెట్‌లోని చివరి కౌంటి ఈ మెడాగ్ కావడం గమనార్హం.
సుమారు 2 బిలియన్ యువాన్ల పెట్టుబడితో ఈ హైవే ప్రాజెక్టును 2014లో ప్రారంభించింది చైనా. అరుణాచల్ ప్రదేశ్‌ని టిబెట్‌లో భాగంగా చెబుతూ వస్తోన్న చైనా.. భారత అభ్యంతరాలను పట్టించుకోకుండా.. బ్రహ్మపుత్ర లోయ మీద నిర్మించే మెగా డ్యామ్ ప్రణాళికకు ఆమోద ముద్ర వేసుకుంది.
ఇవీ చదవండి: వీడని వూహాన్ ల్యాబ్ మిస్టరీ!