ETV Bharat / international

గల్వాన్​ నదిపై ఆనకట్టా.. మాకు తెలియదే: చైనా

తూర్పు లద్దాక్​లో గల్వాన్​ నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ చైనా అక్రమంగా నిర్మిస్తున్న ఆనకట్ట గురించి తనకేమీ తెలియదని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ బుకాయించారు. భారత్​-చైనా సైనికుల మధ్య ఘర్షణలో... తప్పంతా భారత్​పై తోసేయాలని విఫలయత్నం చేశారు. అయితే సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు చైనా కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

China brushes aside questions on attack by its troops on Indian soldiers, damming Galwan river
గాల్వన్​ నదిపై ఆనకట్టా.. నాకు తెలియదే: లీజియన్​
author img

By

Published : Jun 18, 2020, 5:31 PM IST

Updated : Jun 18, 2020, 7:08 PM IST

తూర్పు లద్దాక్ గల్వాన్ లోయ వద్ద భారత సైనికులపై రాళ్లు, ఇనుప రాడ్లతో చైనా బలగాలు చేసిన దాడిపై స్పందించడానికి ఆ దేశం నిరాకరించింది. అలాగే భారత్​-చైనా సరిహద్దు వద్ద గల్వాన్ నదీ ప్రవాహాన్ని నిరోధిస్తూ నిర్మిస్తున్న డ్యామ్​ విషయంపైనా స్పందించకుండా మౌనం వహిస్తోంది.

గల్వాన్​ లోయలో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో చైనా వైపు జరిగిన ప్రాణ నష్టం గురించి అడిగిన ప్రశ్నకు కూడా చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ మౌనం వహించారు. సరిహద్దు ఘర్షణకు భారత సైనికులే కారణమని .. వాస్తవాధీన రేఖ వెంబడి ఏకపక్ష ధోరణిలో పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించారని లిజియన్ ఆరోపించారు. ఈ విషయంలో తమ సైనికుల తప్పేమీ లేదని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.

శాంతి చర్చలకు సిద్ధం

బుధవారం.. భారత్-చైనా విదేశాంగ మంత్రులు జయ్​శంకర్, వాంగ్​ యీ ఫోన్​లో చర్చలు జరిపిన విషయాన్ని లిజియన్​ గుర్తుచేశారు. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించి, శాంతి పునరుద్ధరణ కోసం చర్చలు జరపాలని ఇరువురు మంత్రులు ఓ అంగీకారానికి వచ్చారని లిజియన్​ వెల్లడించారు.

ఆ విషయం నాకు తెలియదు..

గల్వాన్​ నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ చైనా నిర్మిస్తున్న ఆనకట్ట శాటిలైట్​ ఫొటోల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు... ఆనకట్ట విషయం గురించి తనకు అవగాహన లేదని లిజియన్​ పేర్కొన్నారు. మరోవైపు సరిహద్దుల నుంచి భారత్​.. తన బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాలను గౌరవించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

సరిహద్దుల్లో శాంతి స్థాపనకు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, సైనికపరమైన చర్చలు జరుగుతున్నట్లు లిజియన్ వెల్లడించారు. ప్రస్తుతానికి వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు నిలకడగానే ఉన్నాయని స్పష్టం చేశారు.

సరిహద్దు ఘర్షణ

తూర్పు లద్దాక్​ గల్వాన్​ లోయ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో.. 20 మంది భారతీయ జవానులు మరణించగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనా వైపు 43 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాంతి పునరుద్ధరణ కోసం ఇరుదేశాల మధ్య మేజర్ జనరల్స్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: చైనా కంపెనీతో రైల్వే కాంట్రాక్ట్ రద్దు!

Last Updated : Jun 18, 2020, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.