ETV Bharat / international

ఓలి 'శ్రీ రాముని' వ్యాఖ్యలపై ఢాకాలో నిరసనలు

నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్​లో ఆందోళనలు చేపట్టారు హిందూ ధర్మ సురక్షా పరిషత్​ కార్యకర్తలు. రాముడు నేపాలీ అని.. అసలైన అయోధ్య నేపాల్​లో ఉందన్న ఓలి వ్యాఖ్యల నేపథ్యంలో మానవహారంగా ఏర్పడి, నిరసన తెలిపారు.

Bangladesh Hindu Grand Alliance protests against Nepali PM's remark on Lord Ram
ఓలి 'శ్రీ రాముని' వ్యాఖ్యలపై బంగ్లాదేశ్​లో నిరసనలు
author img

By

Published : Jul 19, 2020, 5:25 PM IST

హిందువుల దైవం రాముడు భారతీయుడు కాదంటూ నేపాల్​ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్​లో ఆందోళనలు జరిగాయి. ఢాకాలోని జతియా ప్రెస్​ క్లబ్​ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు హిందూ ధర్మ సురక్షా పరిషత్​, బంగ్లాదేశ్​ నేషనల్​ హిందూ గ్రాండ్​ ఎలయన్స్​ కార్యకర్తలు.

రాముడు నేపాలీ అని.. అసలైన ఆయోధ్య నేపాల్​లో ఉందని ఇటీవలే వ్యాఖ్యానించారు ఓలి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నేపాల్​ ప్రధానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నేపాల్​ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ లాభం లేకుండా పోయింది.

ఇదీ చూడండి:- భారత్,​ నేపాల్​ మధ్యలో చైనా- నిలిచేది ఎవరి బంధం?

నేపాల్​పై అదృశ్య శక్తుల ప్రభావం పడిందని.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని నిరసనకారులు ఆరోపించారు.

నేపాల్​ ప్రధాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బంగాల్​లో నిరసనలు చెలరేగడం ఇది రెండోసారి. ఈ నెల 17న ఢాకా ప్రెస్​ క్లబ్​ వద్ద మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు జాగ్రతో హిందూ సమాజ్​ కార్యకర్తలు.

గత కొంత కాలంగా భారత్​తో కయ్యానికి కాలుదువ్వుతున్నారు నేపాల్​ ప్రధాని ఓలి. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి భారత్​ యత్నిస్తోందని ఆరోపించారు. అయితే ఓలి వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి ఓలి రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తున్నారు పార్టీ సభ్యులు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.