ఆస్ట్రేలియా సీనియర్ మంత్రి పీటర్ డటన్ కరోనా బారినపడ్డారు. తాజాగా అతడికి వైద్య పరీక్షలు చేయగా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన బ్రిస్బేన్ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల పీటర్ అమెరికాలో ఇవాంకా ట్రంప్, యూఎస్ అటార్నీ జనరల్ విలియమ్ బార్‌ను కలిశారు. జాతీయ భద్రత కమిటీకి హాజరైన ఆయన గొంతునొప్పి, జ్వరంతో బాధపడ్డారు.
"నేను వెంటనే క్వీన్స్లాండ్ ఆరోగ్య శాఖను సంప్రదించి కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నా. నాకు కరోనా సోకినట్లు వైద్యులు తేల్చారు. వెంటనే ఆస్పత్రిలో చేరా. క్వీన్స్లాండ్ ఆరోగ్య శాఖ నిబంధన ప్రకారం కరోనా నిర్ధరణ అయిన ఏ వ్యక్తి అయినా వెంటనే ఆస్పత్రిలో చేరాలి. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది."
-- పీటర్ డటన్, ఆస్ట్రేలియా మంత్రి
ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 196 కరోనా కేసులు నమోదవగా ముగ్గురు మృతి చెందారు. రానున్న ఆరు నెలల్లో లక్షల మంది ఈ వైరస్ బారినపడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య శాఖ హెచ్చరిచ్చింది.
ఐదు దేశాల మంత్రులతో..
ఈనెల 5వ తేదీన ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ దేశాల ఇంటెలిజెన్స్ కూటమి భద్రతా మంత్రుల సమావేశం జరిగింది. ఇందుకు మంత్రి పీటర్ డటన్ అమెరికా వెళ్లారు.
నటులకూ తప్పని కరోనా తిప్పలు
కరోనా పలువురు నటులకూ సోకింది. ఇటీవల కొవిడ్-19 సోకిందని నిర్ధరణ కావడం వల్ల నటుడు టామ్ హాంక్ ఆయన భార్య రితా.. విల్సన్ ఆస్పత్రిలో చేరారు.
ఇదీ చదవండి: కరోనాపై ఆ మహిళ విజయం సాధించిందిలా...