ఇండోనేషియాను భూకంపం కుదిపేసింది. మలుకు రాష్ట్రం అంబన్ నగరంలో భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. భూకంప లేఖినిపై తీవ్రత 6.5గా నమోదైంది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంపం ధాటికి ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై నుంచి పడి మరణించాడు. మరో వ్యక్తి ఆచూకీ గల్లంతైంది. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి.
అంబన్ నగరానికి ఈశాన్య దిశగా సుమారు 37 కిలోమీటర్ల దూరంలో 29 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
అంబన్ నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ భూకంపం ప్రభావం చూపినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: విద్యార్థుల నిరసనలతో భగ్గుమన్న ఇండోనేసియా