ETV Bharat / international

ఈనెల 24న ఆసియాన్ సదస్సు- మయన్మార్​పై చర్చ!

author img

By

Published : Apr 16, 2021, 7:07 PM IST

ఆసియాన్ దేశాల​ సదస్సు ఏప్రిల్ 24న ఇండోనేసియాలోని జకార్తాలో జరగనుంది. కూటమిలోని 10 దేశాల నేతలు.. మయన్మార్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చర్చించనున్నట్లు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ASEAN summit
ఆసియాన్ సదస్సు

ఏప్రిల్ 24న ఇండోనేసియాలోని జకార్తాలో ఆసియాన్ దేశాల సదస్సు జరగనుంది. మయన్మార్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చర్చించేందుకు సమావేశమవుతున్నట్లు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సన్నిహిత వర్గాలు తెలిపాయి. 10 సభ్య దేశాల అధినేతలందరూ పాల్గొనే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి.

మయన్మార్​లో సైనిక ప్రభుత్వ మారణకాండలో దాదాపు 700లకుపైగా పౌరులు మరణించారు. మయన్మార్​లో సైన్యం తిరుగుబాటు చేసిన తర్వాత ఘర్షణల్లో వందల మంది చనిపోయిన క్రమంలో ఆసియన్​ సదస్సుకు పిలుపునిచ్చారు విడోడో. ఈ క్రమంలో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.

సభ్యత్వ దేశాలివే

మొత్తం 10దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఇండోనేసియా, పిలిప్పిన్స్​, సింగపూర్​, థాయి​లాండ్​, బ్రూనై, వియత్నాం, లావోస్​, మయన్మార్​, కాంబోడియా. వాటితో పాటు భారత్​, చైనా, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు పార్ట్నర్​ దేశాలుగా ఉన్నాయి.

ఇదీ చదవండి : 'బ్రెగ్జిట్​'పై చర్చల్లో ఈయూ, బ్రిటన్​ విఫలం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.