ETV Bharat / international

ఆ విషయంలో ఆర్మేనియా-అజర్​బైజాన్​ మధ్య ఏకాభిప్రాయం

ఆర్మేనియా, అజర్​బైజాన్​ల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎంతో మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగా నివాస ప్రాంతాలు, సైనికేతర వస్తువులు లక్ష్యంగా దాడులు చేసుకోకూడదని ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. జెనీవాలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చారు.

author img

By

Published : Oct 31, 2020, 1:16 PM IST

Armenia, Azerbaijan
ఆర్మేనియా-అజర్​బైజాన్

వివాదాస్పద నాగోర్నో-కరాబఖ్​ ప్రాంతంపై ఆధిపత్యం కోసం కొన్ని రోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి ఆర్మేనియా, అజర్​బైజాన్​లు. క్షిపణుల దాడులు, బాంబుల మోతలతో ఎంతోమంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ​ఈ క్రమంలో నివాస ప్రాంతాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసుకోకూడదనే ఏకాభిప్రాయానికి వచ్చాయి ఇరు దేశాలు.

జెనీవాలో ఆర్మేనియా, అజర్​బైజాన్​ల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రష్యా, అమెరికా, ఫ్రాన్స్​ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఐరోపాలోని ఆర్గనైజేషన్​ ఫర్​ సెక్యూరిటీ అండ్​ కోఆపరేషన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కాల్పుల విరమణపైనా ఇరు దేశాలు సానుకూలంగా స్పందించినట్లు ఆర్గనైజేషన్​ ఫర్​ సెక్యూరిటీ అండ్​ కోఆపరేషన్ ఓ ప్రకటన జారీ చేసింది.

" అంతర్జాతీయ మానవతా చట్టానికి అనుగుణంగా సాధారణ పౌరులు, సైనికేతర వస్తువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోబోమని ఇరు పక్షాలు అంగీకరించాయి. యుద్ధభూమిలో మరణించిన సైనికులను తీసుకెళ్లేందుకు సహాయం, వారం రోజుల్లో యుద్ధ ఖైదీల వివరాలు అందించుకునేందుకు ఒప్పుకున్నాయి."

- ఆర్గనైజేషన్​ ఫర్​ సెక్యూరిటీ అండ్​ కోఆపరేషన్​

ఇదీ చూడండి: యుద్ధమేఘాలు: ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ వివాదమేంటి ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.