ETV Bharat / international

నేడు రష్యా, భారత్​, చైనా విదేశాంగ మంత్రుల భేటీ

author img

By

Published : Sep 10, 2020, 6:40 AM IST

రష్యా, భారత్​, చైనా విదేశాంగ మంత్రులు మాస్కోలో గురువారం భేటీ కానున్నారు. భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరినవేళ ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు విరామంలో మూడు దేశాల విదేశాంగ మంత్రులు విందు సమావేశంలో పాల్గొననున్నారు.

Jaishankar meeting with Wang yi
మాస్కోలో భారత్, రష్యా, చైనా విదేశాంగ మంత్రుల భేటీ

సరిహద్దు వివాదం నేపథ్యంలో మాస్కోలో గురువారం.. రష్యా, భారత్​, చైనా (ఆర్​ఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్​సీఓ) సదస్సు విరామం సందర్భంగా ఈ ముగ్గురు మంత్రులు విందు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్​రోవ్ ఈ విందు ఇవ్వనున్నారు. భారత్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్​.జైశంకర్, చైనా మంత్రి వాంగ్ యి విందులో పాల్గొననున్నారు.

ఈ విషయాన్ని బీజింగ్​లో చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ వెల్లడించారు. మరోవైపు ఎస్​సీఓ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు, ఇతర అంతర్జాతీయ ఎస్​సీఓ సదస్సులో సాధారణంగా రెండు దేశాల ద్వైపాక్షిక వ్యవహారాలపై చర్చలు జరగవు. కానీ ప్రస్తుతం భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న దృష్ట్యా రెండు దేశాలకూ నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారత్-చైనా విదేశాంగశాఖ మంత్రుల మధ్య భేటీకి ఇది మంచి అవకాశం కలిగిస్తుందని సెక్యూరిటీ రిస్క్స్​ ఆసియా సంస్థ డెరెక్టర్ రాహుల్ భోన్సలే 'ఈటీవీ భారత్​'కు చెప్పారు. భారత్-చైనా, భారత్ పాక్​ల మధ్య చర్చలు జరగాలని రష్యా కచ్చితంగా సూచిస్తుందని చెప్పారు. అయితే జైశంకర్, పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీల మధ్య చర్చలు జరిగే అవకాశం లేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే భారత్-చైనా రక్షణ శాఖల మంత్రుల మధ్య మాస్కోలో చర్చలు జరిగినందున దానికి కొనసాగింపుగా విదేశీ వ్యవహారాల మంత్రుల భేటీ కూడా ఉండే అవకాశం ఉంది.

రష్యాతో సంబంధాల బలోపేతం..

రష్యా విధేశాంగ మంత్రి సెర్గీ లవ్​రోవ్​తో బుధవారం భేటీ అయిన జైశంకర్.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతంపై చర్చలు జరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా భారత్​-రష్యాల భాగస్వామ్య అభివృద్ధి, బ్రిక్స్ ఐక్యరాజ్య సమితి చట్టాల్లో పరస్పర సహకారం అంశాలు చర్చకు వచ్చినట్లు ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి:'నోబెల్​ శాంతి బహుమతి' రేసులో ట్రంప్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.