న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్ ప్రాంతంలో నివాసం ఉంటోంది అయా అల్ ఉమారీ. రోజూ అన్న హుస్సేన్‌తో కలిసి అల్లరి చేస్తూ ఆనందంగా గడిపేది. చెల్లి ఏ దుస్తులు ధరించినా బాగుంది అని అల్లరిపెట్టేవాడు హుస్సేన్. గత గురువారం బయటికి వెళ్తూ అయా ధరించిన టీషర్ట్‌పై అక్షరాల్ని సరదాగా పలికాడు అవే" సీ యూ బై." ఆ సందర్భంలో అవి అల్లరి మాటలే అయినా..వారిద్దరి మధ్య అవే చివరి మాటలయ్యాయి.
క్రైస్ట్ చర్చ్ వద్ద జరిగిన ముష్కర దాడిలో ప్రాణాలు కోల్పోయాడు హుస్సేన్. అన్న జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది అయా. 'సీ యూ బై' అంటూ కడసారి వీడ్కోలు పలికాడంటూ గుర్తు చేసుకుంటోంది. ఇంకా అందని అన్న మృతదేహం కోసం నిరీక్షిస్తోంది. అన్న దేహం ఇంకా మసీదులోనే ఉందా ఆస్పత్రి మార్చురీలో ఉందా అనేది తెలియక గాబరా పడుతోంది అయా. పోలీసులు తమ విధులు నిర్వహించాలి.. అదే సమయంలో బాధిత కుటుంబాలకూ అండగా నిలవాలని అయా కోరుతోంది.