ETV Bharat / international

ఆ అధికారి కన్ఫ్యూజన్ వల్లే హడావుడిగా ఘనీ పరార్! - అఫ్గానిస్థాన్​

అఫ్గానిస్థాన్​ దాదాపుగా తాలిబన్ల చేతికి వెళ్లిందన్న క్రమంలో దేశం విడిచి పారిపోయారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ(ashraf ghani fled the country). తాను కట్టుబట్టలతో దేశం విడిచినట్లు వెల్లడించారు. అయితే.. అంత హడావుడిగా ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది? అధ్యక్షుడు హెలికాప్టర్​ ఎక్కే ముందు ఏం జరిగింది?

Afghan President Ashraf Ghani
అఫ్గానిస్థాన్​ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ
author img

By

Published : Aug 30, 2021, 12:59 PM IST

అది ఆగస్టు 14, ప్రెసిడెంట్​ ప్యాలెస్​లో అఫ్గానిస్థాన్​ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ(ashraf ghani news).. తన సన్నిహితులతో భేటీ అయ్యారు. తాలిబన్లతో అధికారం పంచుకోవటం, భవిష్యత్తు కార్యాచరణ వంటి విషయాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. మరోవైపు.. అఫ్గాన్​లోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటున్న వార్తలు వరుసగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే లంచ్​ సమయానికి ఘనీ మినహా.. అంతా భోజనానికి వెళ్లారు. కట్​ చేస్తే.. భోజనం చేసిన వచ్చిన అధికారులకు అధ్యక్షుడు కనిపించలేదు(ashraf ghani fled the country). ప్యాలెస్​ మొత్తం నిశబ్దంగా మారిపోయింది.

దింతో.. అమెరికా బలగాల ఉపసంహరణ గడువు ఆగస్టు 31 వరకు అధ్యక్షుడిగా ఘనీ కొనసాగుతారని, చర్చల ద్వారా అధికార బదలాయింపు జరుగుతుందని నమ్మకంతో ఉన్న అధికారులకు షాక్​ తగిలినట్లయింది.

ఆ గంటలో ఏం జరిగింది?

ఉన్నతాధికారులంతా మధ్యాహ్న భోజనానికి వెళ్లిన క్రమంలో ఘనీకి అత్యంత సన్నిహిత అధికారి ఒకరు వచ్చి తాలిబన్లు(Afghanistan Taliban) ప్యాలెస్​లోకి ప్రవేశించారని, మీ కోసం ప్రతి గదిని వెతుకుతున్నారని చెప్పాడు. ఇక్కడే ఉంటే మిమ్మల్ని చంపేస్తారని హెచ్చరించాడు. దాంతో ఆందోళన చెందిన ఘనీ, దేశం విడిచేందుకు నిర్ణయించుకున్నారు. ఇంటికి వెళ్లి తనకు సంబంధించిన కొన్ని వస్తువులను తెచ్చుకుంటానని ఆ అధికారితో చెప్పారు. కానీ, ఆ అధికారి అందుకు ఒప్పుకోలేదు. మీకు సమయం లేదని, వెంటనే వెళ్లకపోతే ప్రాణాలకే ప్రమాదమని భయపెట్టాడు. దాంతో తన సన్నిహితులు, అధికారులకు సమాచారం ఇవ్వకుండానే హెలికాప్టర్​ ఎక్కి ఉజ్బెకిస్థాన్​ వెళ్లారు ఘనీ. అక్కడి నుంచి విమానం ద్వారా యూఏఈకి వెళ్లారు.

అసలు ట్విస్ట్ అదే..!

అధ్యక్ష భవనంలోకి తాలిబన్లు ప్రవేశించారనే తప్పుడు సమాచారంతో కన్ఫ్యూజ్​ అయిన అధికారి వల్లే ఘనీ దేశం విడిచినట్లు వాషింగ్టన్​ పోస్ట్​ పేర్కొంది. నిజానికి గతంలో జరిగిన ఒప్పందానికి కట్టుబడి తాలిబన్లు కాబుల్​ పొలిమేరల్లోనే ఉండిపోయారని, ప్యాలెస్​లోకి ప్రవేశించలేదని తెలిపింది. 1996లో తాలిబన్లు దేశాన్ని ఆక్రమించిన క్రమంలో అప్పటి అధ్యక్షుడిని ఏ విధంగా హత్య చేశారో ఊహించుకుని భయంతోనే ఘనీ దేశం విడిచి పారిపోయినట్లు వెల్లడించింది.

అధికారుల పరిస్థితి ఏమిటి?

అష్రఫ్​ ఘనీ దేశం విడిచి పారిపోయిన క్రమంలో ప్రభుత్వంతో పని చేసిన అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాలిబన్లకు దొరికితే తమను బతకనివ్వరని దేశం విడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబుల్​ విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

ఆగస్టు 15న ప్యాలెస్​లోకి తాలిబన్లు..

అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ దేశం విడిచి పారిపోయినట్లు తెలుసుకున్న తాలిబన్లు అధ్యక్ష భవనాన్ని ఆగస్టు 15న ఆక్రమించుకున్నారు. అక్కడి నుంచే మీడియా సమావేశం నిర్వహించారు.

తన నిర్ణయాన్ని సమర్థించుకున్న ఘనీ..

దేశం విడిచిన తర్వాత తొలిసారి ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ పెట్టారు ఘనీ. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. రక్తపాతాన్ని నిరోధించేందుకే దేశం విడిచానని చెప్పారు. భారీగా డబ్బుల బ్యాగులతో పారిపోయారనే వార్తలను ఖండించారు.

ఇదీ చూడండి: దేశాన్ని​ వీడిన అఫ్గాన్​ అధ్యక్షుడు ఘనీ!

Afghanistan News: 'కట్టుబట్టలతోనే అఫ్గాన్​ వదిలి వెళ్లా..!'

Afghanistan News: 'రక్తపాతం వద్దనే దేశం వదిలి వెళ్లా..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.