ETV Bharat / international

బాంబుదాడులతో 4 రోజుల్లో 58 మంది మృతి - అఫ్గాన్ దాడులు 2020

అఫ్గాన్​లో ఇటీవల వరుస బాంబుదాడులు కలకలం రేపుతున్నాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే(అక్టోబర్​ 23 నుంచి 27వరకు) 58 మంది మృతిచెందారని ఓ నివేదిక వెల్లడించింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏట దాడులు కాస్త తగ్గాయని పేర్కొంది.

58 civilians killed in afghanistan from oct 23 to 27
అఫ్గాన్​ బాంబుదాడుల్లో 4రోజుల్లోనే 58మంది మృతి
author img

By

Published : Oct 29, 2020, 2:23 PM IST

అఫ్గానిస్థాన్​లో సాయుధ దళాలపై జరిగిన దాడుల్లో నాలుగురోజుల వ్యవధిలోనే 58 మంది పౌరులు మరణించారు. మరో 143 మంది గాయపడ్డారు. ఈ నెల 23 నుంచి 27 వరకు నాలుగు రాష్ట్రాల్లో(కాబుల్​, ఘాజ్నీ, ఖోస్ట్​, జాబుల్​) ఈ దాడులు సంభవించినట్టు అధికారులు తెలిపారు.

కాబూల్​లో గత శనివారం జరిగిన దాడిలోనే 30మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వారిలో అధిక శాతం విద్యార్థులే ఉన్నారు. మరో 77 మంది క్షతగాత్రులయ్యారు. ఖోస్ట్​లో మంగళ వారం దుండగులు నిర్వహించిన దాడుల్లో.. ఐదుగురు బలయ్యారు. మరో 33 మందికి గాయాలయ్యాయి. అదే రోజు జాబుల్​లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఐదుగురు చనిపోగా.. 13 మంది గాయపడ్డారు. ఘాజ్నీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన పేలుళ్లలో ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో మొత్తం 30 మంది చిన్నారులు బలయ్యారని ఆ దేశ మానవ హక్కుల కమిషన్​ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది(సెప్టెంబర్​ వరకు) ప్రమాదాల బారినపడిన పౌరుల సంఖ్య సుమారు 30 శాతం తగ్గిందని పేర్కొంది.

ఇదీ చదవండి- 'అంతర్జాతీయ సవాళ్లను భారత్‌తో కలిసి ఎదుర్కొంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.