పాకిస్థాన్‌లో ఓ శక్తిమంతమైన బాంబు పేలుడు కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు. అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని బలూచిస్థాన్ రాష్ట్రం చమాన్ నగరం హాజీ నిదా మార్కెట్లో ఈ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు.
అయితే ఈ దాడులకు ఇంకా ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు.
గతంలోనూ..
వేర్పాటువాదులే ఇటీవల తరచూ బలూచిస్థాన్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. జులై 21న టర్బట్ బజార్లో ఇలాంటి తరహా ఘటనే జరిగింది. ఆ దాడిలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు క్షతగాత్రులయ్యారు.
ఇదీ చదవండి: చైనా కక్షసాధింపు- హాంకాంగ్ మీడియా దిగ్గజం అరెస్ట్