దాయాది దేశం పాకిస్థాన్ భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. ముంబయి దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో.. ఈ పేలుడు సంభవించగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది పైగా గాయపడ్డారు. లాహోర్లో సంభవించిన ఈ పేలుడు హఫీజ్ సయీద్ నివాసానికి 120 మీటర్ల దూరంలో జరిగినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది.
అయితే బాంబు వల్ల సంభవించిన పేలుడా, ఇంకేమైనా కారణాల వల్ల ప్రమాదం సంభవించిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు లాహోర్ పోలీస్ చీఫ్ గులాం మొహమ్మద్ వెల్లడించారు. మరోవైపు పేలుడు ఘటనలో ఓ బిల్డింగ్ సహా.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఉగ్రవాద వ్యతిరేక విభాగం(సీటీడీ) ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిందని తెలిపారు.
ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న నేరం కింద లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలులో సయీద్ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదులకు పింఛన్లు ఇచ్చే దేశం.. పాకిస్థాన్'
ఇదీ చూడండి: 'అత్యాచారాలకు కారణం పొట్టి దుస్తులు ధరించడమే'