ETV Bharat / international

నేడు భారత్​-మధ్య ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల భేటీ - అక్టోబర్​ 28 భేటీ

భారత్​-మధ్య ఆసియా దేశాల రెండో సమావేశం నేడు జరగనుంది. ఈసారి వర్చవల్​గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధ్య ఆసియాలోని పలు దేశాలతో మైత్రిని పెంచుకోవడంలో ఈ భేటీ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

2nd India-Central Asia Dialogue to be held virtually on October 28
నేడు.. భారత్​-మధ్య ఆసియా దేశాల భేటీ
author img

By

Published : Oct 28, 2020, 7:31 AM IST

రెండో దఫా భారత్​-మధ్య ఆసియా దేశాల చర్చలు బుధవారం జరగనున్నాయి. వర్చువల్​గా ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

భారత్​, ఖజికిస్థాన్​, తజికిస్థాన్​, తుర్కెమిస్థాన్​, ఉజ్బెకిస్థాన్​, కిర్గిజిస్థాన్​ దేశాల విదేశాంగ మంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు. అఫ్గానిస్థాన్​ విదేశాంగ మంత్రి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరవ్వనున్నారు. ఈ సమావేశంతో భౌగోళిక సంబంధాలు మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

"భౌగోళిక, అంతర్జాతీయ అంశాల్లో విదేశాంగ మంత్రులు పరస్పర అవగాహనకు రానున్నారు. రాజకీయ, రక్షణ, ఆర్థిక, వ్యాపార, మానవీయ, సాంస్కృతిక విషయాల్లో తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. భౌగోళికంగా సంబంధాలను మెరుగుపర్చుకోవడంలో ఈ భేటీ ప్రత్యేక వేదికగా మారుతుంది."

-- అధికారిక వర్గాలు.

భారత్​-మధ్య ఆసియా దేశాల మధ్య మెదటి సమావేశం.. ఉజ్బెకిస్థాన్​లో జనవరి 13, 2019న జరిగింది. ఈ భేటీకి భారత్​, ఉజ్బెకిస్థాన్ దేశాలు నాయకత్వం వహించాయి.

ఇదీ చూడండి:బెకా ఒప్పందంతో చైనా ఆధిపత్యానికి చెక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.