పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 22కు చేరింది. 300 మంది గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. రిక్టర్ స్కేలుపై భూకంప(earthquake news) తీవ్రత 5.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
హర్నాయ్‌కు సమీపంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు భూకంపశాస్త్ర కేంద్రం తెలిపింది. బలూచిస్థాన్‌లోని.. క్వెట్టా, సిబి, హర్నాయ్, పిషిన్, కిలా సైఫుల్లా, ఛామన్, జియారత్, జోబ్పై భూకంపం ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. హర్నాయ్లో సుమారు 70 వరకు భవనాలు కూలిపోయాయని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని చెప్పారు.
అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో వందకుపైగా మట్టి ఇళ్లు కూలిపోవడం వల్ల అనేక మంది నిరాశ్రయులయ్యారు.
ఇదీ చూడండి : మలేరియాకు ఎట్టకేలకు టీకా.. తొలి డోసు వారికే...