ఇండోనేసియాను రెండు భారీ భూకంపాలు వణికించాయి. సుమత్రా దీవుల్లో 6 నిమిషాల వ్యవధిలోనే 6.8, 6.9 తీవ్రతతో సముద్ర గర్భంలో రెండు సార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
సుమత్రా దీవుల్లో బెంగ్కులు రాష్ట్రానికి 144.5 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది అమెరికా జియోలాజికల్ సర్వే. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
ఇదీ చూడండి: సైనిక తిరుగుబాటుతో మాలి అధ్యక్షుడి రాజీనామా