మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనల్లో ఉద్రిక్తత నెలకొంది. దేశంలోనే రెండో ప్రధాన నగరం మాండలేలోని ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు చెందారు.
ఘటనా స్థలంలోనే..
ఈ కాల్పుల్లో ఘటనా స్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిరసనకారులను అదుపులోకి తెచ్చేందుకు గ్యాసు, రబ్బరు తూటాలను పోలీసులు ఉపయోగించారు. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మయన్మార్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఆంక్షలను లెక్కచేయకుండా రోడ్లపైకి వస్తున్న ప్రజలు.. ప్రభుత్వ పునరుద్దరణతో పాటు, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: మయన్మార్: యువతి మృతితో ఆందోళనలు ఉద్ధృతం