ETV Bharat / international

బొగ్గు గని పైకప్పు కూలి 14 మంది మృతి - బొగ్గు గని

Coal Mine Collapse: బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో 14 మంది కూలీలు మృతిచెందారు. ఈ ప్రమాదం 10 రోజుల కింద జరగగా, ఆదివారమే వారి మృతదేహాలను వెలికితీశారు. చైనాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

CHINA MINE COLLAPSE
Mining disasters
author img

By

Published : Mar 6, 2022, 5:10 PM IST

Coal Mine Collapse: చైనాలో 10 రోజుల క్రితం కూలిన బొగ్గు గనిలో చిక్కుకున్న 14 మంది కార్మికులు మృతి చెందారు. వారి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ఆదివారంతో సహాయక చర్యలు ముగిసినట్లు ఆ దేశ అధికార మీడియా జిన్హువా తెలిపింది.

గూజౌ ప్రావిన్స్​లోని సన్హే షున్జున్​ బొగ్గు గని పైకప్పు.. ఫిబ్రవరి 25న కూలింది. గని ప్రారంభం నుంచి 3కి.మీల మేర పైకప్పు ఉండటం, కూలిన ప్రాంతం పెద్దదిగా ఉండటం వల్ల సహాయక చర్యలకు సవాలుగా మారినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

చైనాలోని బొగ్గు గనులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. భద్రతా పరమైన ఉల్లంఘనలతో తరచుగా పేలుళ్లు, గ్యాస్ లీక్​లు సంభవిస్తుంటాయి.

ఇదీ చూడండి: Mine Collapse: బంగారం గనిలో ప్రమాదం- 38 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.